హాయ్ ఫ్రెండ్స్,
మీరు మంచిగా వీడియో లు తియ్యగలరా అలాగే దాని ద్వార డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారా ఐతే దానికి మంచి వేదిక ఉంది అదే youtube . ఇప్పటిలో వారికీ కచ్చితంగా దిని గురుంచి తెలిసే వుంటుంది తెలియక పోయిన పర్వాలేదు ఇక్కడ తెలుసుకోవచ్చు.ఇక్కడ ఇచ్చినది చేయాలి అంటే ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి ఇంట్లో సిస్టం వున్నా అలాగే బయిట ఇంటర్నెట్ కేఫ్ లోనయిన దిన్ని చేయవచ్చు.
కింద వున్నా ఇమేజ్ లు పెద్దవిగా చూడాలంటే వాటి పై క్లిక్ చేయాలి.ఒక చిన్నవిషయం వీడియో లు ఎలాంటివి అంటే స్పూర్తిని ఇచ్చేవి,అనిమేషన్,software కి చెందిన విషియలు,ఏదైనా వింతవి,ప్రకృతివి, మొదలైన లాంటివి వీడియోలు పెట్టవచ్చు. అడల్ట్ కంటెంట్ , పైరసీ,కాపీ రైట్(అంటే ఒకే పేరుతో వీడియో లను పెడితే మీ అకౌంట్ ని youtube వారు disable చేస్తారు)లాంటి జోలికి వెళ్ళకూడదు.ఒక వెల వెళ్ళిన ip అడ్రస్ ఇంకా sign in వివరాలు ద్వార మిమ్మల్ని సైబర్ పోలీస్ లు ట్రేస్ చేసి పట్టుకునే ప్రమాదం వుంది అందుకే మంచి గా వుండేవి అందరికి పనికి వచ్చే వీడియో లను పెట్టటానికి ప్రయత్నం చేయండి.ఈ మధ్య సినిమా వారు,కంపెనీ లు మొదలైనవి వారి యొక్క teasers ని ,trailors వంటివి ముందుగా ఇందులో పెట్టటాన్ని మీరు గమనించవచ్చు.
A)
మీ దగ్గర వున్నా వీడియోలు మొదట windows movie maker లేదా ఏదైనా video converter ని ఉపయోగించి .wmv , .wav formats లోకి మార్చాలి .ఇప్పుడు ఈ వీడియో లను మీ desktop పై వుంచండి.
B)
తర్వాత మీ సిస్టం లో వుండే ఏదైనా బ్రౌజరు (firefox,chrome,explorer,safari,opera)వీటిల్లో ఒకటి open చేసి అక్కడి అడ్రస్ బార్ లో www.youtube.com అని టైపు చేస్తే కింది ఇమేజ్ లో చూపిన విదంగా తెర వస్తుంది.
C)
పైన ఇమేజ్ చూసారు sign in పై click చేస్తే కింది విదంగా తెర వస్తుంది కదా ఇక్కడ sign in అవ్వాలి అంటే అప్పటికే వున్నా gmail అకౌంట్ కి చెందిన username and password లు ఇవ్వాలి కింద ఇమేజ్ చుస్తే అర్ధం అవుతుంది.
D)
ఇప్పుడు sign in పై క్లిక్ చేస్తే కింది తెర వస్తుంది.
E)
దాంట్లో upload అనే button పై క్లిక్ చేయాలి ఇప్పుడు తెరలో వచ్చే మార్పుని కింది ఇమేజ్ లో చూడగలరు.చూసారు కదా అక్కడ వున్నా 'selecte files to upload' క్లిక్ చేయాలి వెంటనే సిస్టం వుండే files డైరెక్టరీ open అవుతుంది అందులో అప్పటికే desktop పై వీడియో లను పెట్టి ఉంచారు కదా వాటిని సెలెక్ట్ చేసి open పై క్లిక్ చేయాలి.ఈ పాయింట్ కి చెందిన ఇమేజ్ లను కిందన గమనించండి.
F)
పైన గమనించారు కదా ఇప్పుడు ఎంచుకున్న వీడియో ఎలా upload అవుతుందో చూడాలంటే దానికి కింద ఇమేజ్ చుస్తే తెలిస్తుంది.
ఇప్పుడు పై ఇమేజ్ లోని నంబర్స్ ని చూసారా వాటి గురుంచి కొంచెం తెలుసుకుందాం ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు ఇప్పుడు చేయ్యబోయేది ఒక ఎత్తు ఎందుకు ఇలా అంటున్న అంటే ఇక్కడ నుండి ఇచ్చే సమాచారం చాలా కీలకమైనది కనుక.
1.upload pageలో మొదటిది వీడియో upload అవుతున్నది ఎంత percentage లో వున్నది అలాగే అది అయిన వెంటనే installing అవుతుంది.
2.మీ వీడియో కి సంబందించే టైటిల్ ఇవ్వాలి అది అక్కటుకునే విదంగా వుండాలి.
3.మీ వీడియో ని అందరు చూడాలంటే public ని ఎంచుకోవాలి,అలా కాక ఒక్క ఎకౌంటు లో వున్నా వారె చూడాలంటే అక్కడే privacy option వుంటుంది దాని సెలెక్ట్ చేయాలి.
4.మీ వీడియో దేనికి చెందినది ఎలాంటి కంటెంట్ అందులో వున్నది లాంటి వివరాలను ఇక్కడ ఇవ్వాలి.
5.ఇది చాలా చాలా ముక్యమైనది మీ వీడియో దేనికి చెందినదో ,అలాగే చాలా మంది youtube లో సెర్చ్ చేసిన వెంటనే చూడటం కోసం కొన్ని ట్యాగ్ లు (అంటే keywords)ఇవ్వాలి అవి కూడా చిన్న పదాలు అయి వుండాలి.అప్పుడు ఎవరైనా వెతికినా వెంటనే మీ వీడియో వస్తుంది.
6.మొదటి పాయింట్ లో చెపిన upload పూర్తీ ఐతే ఇక్కడ కొన్ని ఇమేజ్ లు వస్తాయి అందులో ఒకటి సెలెక్ట్ చేయాలి ఇది ఎందుకంటే మీ వీడియో చూసే వారికీ తెలియటం కోసం .ఇక్కడ జాగర్తగా thumbnail ని ఎంచుకోవాలి అందర్నీ ఆకట్టుకోవాలి కదా .
7.చివరిగా publish పై క్లిక్ చేస్తే అందరు చూడటానికి అయినట్లే.
G)
ఇప్పుడు అకౌంట్ ని sign-out చేసి మళ్లి youtube లోకి మీ వీడియోకి ఏ title ఇచ్చారో దాని సెర్చ్ లోని టైపు enter ప్రెస్ చేస్తే కింద మీ వీడియో వస్తుంది దాని పై క్లిక్ చేస్తే next page లో వీడియో ప్లే అవుతుంది.ఐతే ఇది play అవ్వేటప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ పై ఆదారిపడి ఉంటుంది.
ఈ పోస్ట్ చదివిన మీకు ధన్యవాదాలు.ఈ పోస్ట్ లో మీకు ఏమైనా పదాలు తప్పులుగా కనిపించిన ,సందేహాలు వున్నా,సలహాలు ఇవ్వలన్న కామెంట్స్ ద్వార తెలియపరచండి.ఇది నచ్చితే మీకు తెలిసివారికి ఈ లింక్ ని పంపండి.
0 comments:
Post a Comment