Tuesday, January 21, 2020

గూగుల్ పే నుండి ఒక అలెర్ట్ వచ్చింది



నమస్తే, గూగుల్ నుండి ఒక సెక్యురిటి అలెర్ట్ మెసేజ్ రావటం జరిగింది. ముఖ్యంగా ఈ మెసేజ్ ఎవరికి అంటే గూగుల్ పే(Google pay) వాడుతున్న వారికి. ఇక ఈ మెసేజ్ లోని గూగుల్ ఎమ్ తెలిపింది అన్నది తెలుగులో మీ కోసం క్రింద ఇవ్వటం జరిగింది.

గూగుల్ పే అంటేనే పెమెంట్స్ కోసం వాడే యాప్ అటువంటి యాప్ ని కొందరు తప్పుగా వాడుతున్నట్లు గుర్తించి స్వయంగా గూగుల్ టీం రంగంలోకి దిగి తమ గూగుల్ పే యూజర్ల కోసం వారి ఈమెయిల్ అకౌంట్ సెక్యురిటి అలెర్ట్ గా మేసేజ్ పంపటం జరిగింది. ఇక అదేంటో చూడండి.

1. tollfree లేదా customer care లాంటి నెంబర్ల విషయం లో ఎటువంటి సెర్చ్ చేయకుండా పెమెంట్స్ యాప్ లేదా వెబ్సైట్ లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ లకి చేయాల్సిందిగా తెలిపింది. ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే పెమెంట్ యాప్ కి చెందిన మోర్ డీటెయిల్స్ చూస్తే కనిపిస్తాయి ఒక వేళ అలా లేకపోతే వాటి యొక్క ఆఫీషల్ వెబ్సైట్ లో చూసిన ఉంటాయి.
2. UPI పిన్ నెంబర్ ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు అని తెలిపింది. ఎందుకంటే ఈ పిన్ ATM పిన్ ఎలానో దీనికి అలాగే.
3.నమ్మకమైన యాప్స్ ని మాత్రమే అది కూడా గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న వాటినే ఇంస్టాల్ చేసుకోవాలి. అవే యాప్స్ ఇతర వెబ్సైట్ లో లభిస్తే ఇంస్టాల్ చేయటం వల్ల వాటికి అదనపు కోడింగ్ జత చేసే ప్రమాదం ఉంటుంది దాంతో పెమెంట్స్ కి చెందిన యాప్స్ మరియు వ్యక్తిగత సమాచారం స్క్రీన్ రికార్డ్ చేసే అవకాశం ఉంది.
4. UPI పిన్ ఎంటర్ చేసే సమయంలో ఏ యాప్ లో ఉన్నారో చూసుకోండి అంటే BHIM యాప్ లో మరియు నమ్మదగిన యాప్స్ లో మాత్రమే ఈ upi పిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కనుక యాప్ లో స్క్రీన్ కదలికలు కూడా గమనించాలి.
5. ఇక రిసీవ్ చేసుకునే పేమెంట్ కి upi pin ఎంటర్ చేయాల్సిన పని లేదు.


అలాగే మీ యొక్క డిజిటల్ పెమెంట్స్ మరింత సురక్షితంగా ఉంచేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నట్లు మరియు పేమెంట్ విషయంలో మోసం చేసే వారి నుండి ఎల్లప్పుడు రక్షణగా ఉంటాము అని ఈ మెసేజ్ లో గూగుల్ స్పష్టంగా తెలపటం జరిగింది.
ఒక వేళ మీకు ఈ మెసేజ్ వచ్చిందో రాలేదో కామెంట్ లో తెలపండి.

0 comments:

Post a Comment