Friday, January 31, 2020

పేటియమ్ లో క్యాష్ బ్యాక్ మరియు ఆఫర్స్ లో ద్వారా ఎంత ఏఆర్న్ చేసారో ఇలా చూసుకోండి.


నమస్తే, paytm లో వచ్చిన ఈ కొత్త అప్డేట్ ద్వారా మీ అకౌంట్ లో ఇప్పటివరకు క్యాష్ బ్యాక్ మరియు ఆఫర్స్ ద్వారా ఎంత సంపాదించారో తెలుసుకునే అవకాశాన్ని స్వయంగా పేటియం అందివ్వటం జరుగుతోంది. ఐతే ఈ ఫీచర్ కావాలనుకుంటే మీరు ఇప్పటికే పేటియం వాడుతున్నట్లు ఐతే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్ ని అప్డేట్ చేసుకోండి ఒకవేళ అప్డేట్ అందుబాటులో లేకపోతే థర్డ్ పార్టీ సైట్ లనుండి మాత్రం ఇంస్టాల్ మరియు అప్డేట్ చేసుకోకండి గూగుల్ ప్లే అప్డేట్ వచ్చేంతవరకు వేచి ఉండటం మంచిది. ఇక ఈ ఫీచర్ కొత్త వెర్షన్ 8.6.3 లో అందుబాటులో వచ్చింది.

ఈ యాప్ ఈ వెర్షన్ కి అప్డేట్ చేసిన తరువాత cashback and offers పై క్లిక్ చేస్తే ఇప్పటివరకు మీకు ఎంత మనీ అనేది క్యాష్ బ్యాక్ మరియు ఆఫర్స్ లో వచ్చిందో చూపిస్తుంది అలాగే అంత అమౌంట్ అనేది ఎలా వచ్చిందో ఏ తేదీల్లో వచ్చిందో కూడా తెల్సుకోవచ్చు అందుకోసం ఆ అమౌంట్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది లిస్ట్ వారీగా క్యాష్ బ్యాక్ మరియు ఆఫర్స్ వచ్చినా అమౌంట్స్ చూపిస్తుంది.


ఈ టాపిక్ మీకు నచ్చితే షేర్ మరియు కామెంట్ చేయండి.

Tuesday, January 28, 2020

గ్యాస్ సిలిండర్ ధరలను ఇలా తెలుసుకోండి.


నమస్తే, LPG గ్యాస్ non-subsidy సిలండర్ల యొక్క ధరలను ఈ టాపిక్ లో ఎలా తెలుసుకోవలో ఇవ్వటం జరిగింది.
ఇక టాపిక్ లోకి వెళ్తే, గ్యాస్ సిలండర్ యొక్క ధరలు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు మార్పులు పై ఆధారపడి ఉండటం చేత గ్యాస్ ధరలు ఎప్పటికప్పుడు మారుతున్నయి.మరి అలాంటి సమయంలో ఏరోజు ఎంత సిలండర్ ధర ఉందో మనం తెలుసుకునే అవకాశం ఉంది.ఐతే ఈ ధర కి కొంచెం ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు అది మీకు గ్యాస్ ఏజెన్సీ వారు సిలండర్ బుక్ చేసిన తరువాత మెసేజ్ మీ మొబైల్ నెంబర్ కి పెట్టడం జరుగుతుంది.
ఇక ఎలా ఈ గ్యాస్ ధరలు చూడాలి అంటే కింద ఒక లింక్ ఇవ్వటం జరిగింది దాని పై క్లిక్ చేయండి.

ఇప్పుడు లింక్ ఓపెన్ అవుతుంది అందులో డ్రాప్ డౌన్ లిస్ట్ లో రాష్ట్రం మరియు సిటీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ మీ రాష్ట్రం మరియు సిటీ ఎంచుకుంటే సరి ఆ రోజు సిలండర్ ధర ఎంత అనేది చూపిస్తుంది.అలాగే ఇక్కడ అదే తేదీన గతంలో సిలండర్ ధర ఎంత ఉన్నది కూడా చూపించటం జరుగుతోంది.

ఈ టాపిక్ మీ అవగహన కోసం మాత్రమే ఇవ్వటం జరిగింది.నచ్చితే షేర్ చేయండి.

Tuesday, January 21, 2020

గూగుల్ పే నుండి ఒక అలెర్ట్ వచ్చింది



నమస్తే, గూగుల్ నుండి ఒక సెక్యురిటి అలెర్ట్ మెసేజ్ రావటం జరిగింది. ముఖ్యంగా ఈ మెసేజ్ ఎవరికి అంటే గూగుల్ పే(Google pay) వాడుతున్న వారికి. ఇక ఈ మెసేజ్ లోని గూగుల్ ఎమ్ తెలిపింది అన్నది తెలుగులో మీ కోసం క్రింద ఇవ్వటం జరిగింది.

గూగుల్ పే అంటేనే పెమెంట్స్ కోసం వాడే యాప్ అటువంటి యాప్ ని కొందరు తప్పుగా వాడుతున్నట్లు గుర్తించి స్వయంగా గూగుల్ టీం రంగంలోకి దిగి తమ గూగుల్ పే యూజర్ల కోసం వారి ఈమెయిల్ అకౌంట్ సెక్యురిటి అలెర్ట్ గా మేసేజ్ పంపటం జరిగింది. ఇక అదేంటో చూడండి.

1. tollfree లేదా customer care లాంటి నెంబర్ల విషయం లో ఎటువంటి సెర్చ్ చేయకుండా పెమెంట్స్ యాప్ లేదా వెబ్సైట్ లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ లకి చేయాల్సిందిగా తెలిపింది. ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే పెమెంట్ యాప్ కి చెందిన మోర్ డీటెయిల్స్ చూస్తే కనిపిస్తాయి ఒక వేళ అలా లేకపోతే వాటి యొక్క ఆఫీషల్ వెబ్సైట్ లో చూసిన ఉంటాయి.
2. UPI పిన్ నెంబర్ ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు అని తెలిపింది. ఎందుకంటే ఈ పిన్ ATM పిన్ ఎలానో దీనికి అలాగే.
3.నమ్మకమైన యాప్స్ ని మాత్రమే అది కూడా గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న వాటినే ఇంస్టాల్ చేసుకోవాలి. అవే యాప్స్ ఇతర వెబ్సైట్ లో లభిస్తే ఇంస్టాల్ చేయటం వల్ల వాటికి అదనపు కోడింగ్ జత చేసే ప్రమాదం ఉంటుంది దాంతో పెమెంట్స్ కి చెందిన యాప్స్ మరియు వ్యక్తిగత సమాచారం స్క్రీన్ రికార్డ్ చేసే అవకాశం ఉంది.
4. UPI పిన్ ఎంటర్ చేసే సమయంలో ఏ యాప్ లో ఉన్నారో చూసుకోండి అంటే BHIM యాప్ లో మరియు నమ్మదగిన యాప్స్ లో మాత్రమే ఈ upi పిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కనుక యాప్ లో స్క్రీన్ కదలికలు కూడా గమనించాలి.
5. ఇక రిసీవ్ చేసుకునే పేమెంట్ కి upi pin ఎంటర్ చేయాల్సిన పని లేదు.


అలాగే మీ యొక్క డిజిటల్ పెమెంట్స్ మరింత సురక్షితంగా ఉంచేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నట్లు మరియు పేమెంట్ విషయంలో మోసం చేసే వారి నుండి ఎల్లప్పుడు రక్షణగా ఉంటాము అని ఈ మెసేజ్ లో గూగుల్ స్పష్టంగా తెలపటం జరిగింది.
ఒక వేళ మీకు ఈ మెసేజ్ వచ్చిందో రాలేదో కామెంట్ లో తెలపండి.

Monday, January 6, 2020

PicsArt లో ఫాంట్స్ ని ఎలా పెట్టాలో చూడండి.


నమస్తే , లాస్ట్ పోస్ట్ లో wps ఆఫీస్ లో ఫాంట్స్ పెట్టటం చూసి ఉంటారు. ఇప్పుడు picsart లో fonts ఎలా పెట్టాలి అని చూద్దాం ఒక వేళ wps ఆఫీస్ కి చెందిన కంటెంట్ చదవకపోతే ముందు అది చదవండి. ఇక picsart లో fonts ఎలా పెట్టాలో కింద వివరంగా స్టెప్స్ వారిగా ఇవ్వటం జరిగింది చూసి ఫాంట్స్ ని పెట్టుకోండి.ముందుగా ఫాంట్స్ ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి అందుకోసం online లో కొన్ని వెబ్సైట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే
1. ముందుగా picsart app కావాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇంస్టాల్ చేసుకోండి.
2. ఇప్పటికే ఈ యాప్ వాడుతున్నట్లు ఐతే అప్డేట్ అనేది చేసుకోండి.
3. ఇప్పుడు file manager లో కి వెళ్లి folder వ్యూ లో చూడండి అందులో picsart యాప్ కి చెందిన ఫోల్డర్ ఉంటుంది దాని పై క్లిక్ చేయండి.
4. ఈ ఫోల్డర్ లో మరొక 3 ఫోల్డర్లు ఉంటాయి అందులో ఫాంట్స్ పై క్లిక్ చేయండి.
5. డౌన్లోడ్ చేసి ఉంచిన ఫాంట్స్ ని ఈ ఫాంట్స్ ఫోల్డర్ లో కాపీ మరియు పేస్ట్ చేయండి అంతే

picsart లో ఫాంట్స్ పెట్టటం జరిగింది ఇక యాప్ ఓపెన్ చేసి ఫాంట్స్ ని అప్లై చేయండి.

Sunday, January 5, 2020

భీం యాప్ కొత్త అప్డేట్ కొత్త లుక్


నమస్తే, భీం యాప్ కొత్త అప్డేట్ కొత్త లుక్ రావటం జరిగింది. ఇటీవలే 3 సవంత్సరాలు పూర్తి చేసుకున్న సంధర్బంగా ఈ యొక్క కి కొత్త అప్డేట్ లో కొత్త లుక్ npci మార్పులు చేసి విడుదల చేయటం జరిగింది. ఇక ఇందులో ముఖ్యంగా జాతీయ జెండా లో ఉండే కలర్స్ ని ఎక్కువుగా వాడటం జరిగింది. దాంతో పాత వెర్షన్ కన్నా ఇప్పుడు విడుదల అయిన కొత్త చాలా బాగుంది. మీరు bhim app ఇప్పటి వాడుతు అప్డేట్ చేసుకోకపోతే ప్లే స్టోర్ నుండి చేసుకోండి. ఈ యాప్ పై మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలపండి.