Friday, February 14, 2020

poco x2 స్పెషల్స్ తెలియాలి అంటే చూడాల్సిందే

నమస్తే, పోకో ఎక్స్2 అనే మొబైల్ మోడల్ ని xiaomi విడుదల చేసింది. ఏంటి xiaomi అంటున్నారు అనుకోకండి మీరు చదివింది కరెక్ట్ నే xiaomi ఈ యొక్క poco బ్రాండ్ తో మొబైల్స్ ని విడుదల చేస్తోంది.ఇప్పటికే ఒప్పో రియల్ మీ అనే బ్రాండ్ తో మొబైల్స్ మార్కెట్ లో తెస్తోంది అలాగే xiaomi కూడా. ఇక పోకో x2 లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
1. ఈ పోకో ఎక్స్2 (poco x2) వెనుక 4 కెమెరాలు అందులో 64 మెగాపిక్సెల్,8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్,2 మెగాపిక్సెల్ మరియు 2 మెగాపిక్సెల్ macro ఇవ్వటం జరిగింది.
2. ముందు భాగం లో రెండు కెమెరా లు అందులో ఒకటి 20 మెగా పిక్సెల్ మరొకటి 2 మెగాపిక్సెల్ జత చేయటం జరిగింది.
3.పవర్ బటన్ ఉండే స్థానంలో పవర్ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ కి ఒకే బటన్ ఇవ్వటం జరిగింది.ఇందులో ఫేస్ అన్ లాక్ కూడా ఇవ్వటం జరిగింది.
4.128FPS అనే మరొక ఆప్షన్ ఇవ్వటం జరిగింది. ఇది గేమింగ్ కోసం ఉపయోగపడుతుంది.
5.4k లో వీడియో రికార్డ్ చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంది.
6.ఈ ఫోన్ తో 27w ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వటం తో మొబైల్ ఛార్జింగ్ చాలా త్వరగా చేసుకోవచ్చు.
7.ఇక ఈ మోడల్ లో ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 10 మరియు miui 11 లను పెట్టటం ఇక సెక్యురిటి ప్యాచ్ గా డిసెంబర్ కి చెందిన వెర్షన్ తో వస్తోంది.
8. ఈ పోకో x2 లో ప్రాసెసర్ చూసుకుంటే qualcomm snapdragon 730G ని ఇచ్చారు ఇది లేటెస్ట్ ప్రాసెసర్ అలాగే గేమింగ్ మరియు ఇతర వాడకంలో ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది.
9. ఇక display విషయానికి వస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ని ఫ్రంట్ మరియు బ్యాక్ ఇవ్వటం జరిగింది.
10. పోకో నుండి వచ్చే మొబైల్స్ లో ప్రత్యేక యాప్ లాంచర్ వస్తున్న సంగతి తెలిసిందే అలాగే ఇందులో కూడా ఉంది.
11. ఈ మోడల్ 6GB RAM & 64GB ROM, 6GB RAM & 128GB ROM మరియు 8GB RAM & 256GB ROM వేరియంట్ లో మార్కెట్ లో అందుబాటులో తేవడం జరిగింది.
12. xiaomi అందించే అన్ని యాప్స్ కూడా ఇందులో కూడా ఉండటం అలాగే IR blaster, సెకండరీ నాయిస్ క్యాన్సల్ mic ఇవ్వటం జరిగింది.
13. ఇక ఈ మోడల్ లో నెట్వర్క్ విషయానికి వస్తే అందులో ముందుగా సిం స్లాట్ గురుంచి చూసుకుంటే రెండు సిమ్ లు లేదా ఓక సిమ్ మరియు మెమరీ కార్డ్ వేసుకునే విదంగా స్లాట్ ఇవ్వటం జరిగింది.


0 comments:

Post a Comment