Tuesday, September 23, 2014

మీ pc/laptop slow అవుతోందా.

                            
మీరు pc/laptop 500GB harddisk,inbuilt graphic card మొదలైన సదుపాయాలతో వచేవాటిని ఇష్టంతో అలాగే చాల డబ్బు పెట్టి కొని వుంటారు..కొన్ని రోజులు గడిచాక అది స్లోగా పని చేయటం మొదలు అవుతుంది.ఏంటి ఇంత డబ్బు పెట్టి కొన్నది స్లో గా వుంది అనే అనుమానం కలుగుతుంది.ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని ఆలోచిస్తారు ఐతే కొనే ముందు ఎన్ని జాగర్తలు తిసుకున్నరో తరవాత వాడటం కూడా అంతే జాగర్తతో వాడాలి.ఇక్కడ జాగర్త అంటే ఉద్దేశం కొన్ని (slow అవ్వడానికి)కారణాలు ఉండవచ్చు.కాబట్టి ముందు వాటిని గుర్తించి వాటికీ మీ సొంతంగానే పరిష్కరించవచ్చు. కిందన కొన్ని ఇవ్వటం జరిగింది చదివి తెలుసుకోగలరు.కింది images ని పెద్దవిగా చూడాలి అనుకుంటే వాటిపై click చేయండి.

1.మీ recycle bin ఎప్పుడు నిండిపోయి వుంటుందా ఐతే క్లీన్ చేస్తూ వుండండి.delete చేసేసం కదా అనుకుంటూ వుంటే అవ్వదు .ఎందుకంటే recycle bin వుండే data harddisk లో ఉన్నట్లే అని మరిచిపోవద్దు.కాబట్టి స్లో అవ్వడానికి అవకాశం వుంది.


2.మీ desktop పై ఎక్కువ icons అంటే files storage లాంటివి చేస్తే system పై వత్తిడి పెరిగి slow అయ్యే అవకాశం వుంది.కనుక desktop పై ఎక్కువ files or folders లేకుండా అవసరమైనవి వుంచుకొని మిగతావి తొలగించండి.ఎందుకులే తరవాత చేసుకుందాం అని ఊరుకుంటే అప్పుడు మీ pc/laptop కూడా తర్వాతే fastగా పని చేస్తుంది.  
  
3.మీరు ఇంటర్నెట్ వాడుతున్నట్లు ఐతే మీ pc/laptop ఇంకా త్వరగానే slow గా అవుతుంది.దానికి కారణం మీరు వాడె browsersలో cookies and historyఎక్కువగా  పెరిగిపోతై కనుక వీటిని కూడా తప్పకుండ delete చేస్తూ వుండాలి .ప్రతి రోజు బ్రౌజరు లో వుండే వీటిని క్లీన్ చేయటం వలన pc slow అనేది తగ్గి కొంచెం ఫాస్ట్ వచ్చే అవకశం వుంది.

4.మీరు ఇంటర్నెట్ సదుపాయం కలిగివున్నట్లు ఐతే pc స్లో అవ్వడానికి మరొకటి కూడా కారణం గా చెప్పవచ్చు అదే వైరస్ ఈ వైరస్ ఇంటర్నెట్ ద్వార మీ pc లోకి తెలియకుండానే ప్రవేసిస్తాయి దాంతో మీ system ఎంతటి ఖరీదు చేసినదైన స్లో అవ్వక తప్పదు కనుక ఎప్పటికప్పుడు ఈ వైరస్ లను antivirus అనే softwares తో తొలగించండి.online లో free antivirus versions అందిబాటులో వుంచటం జరిగింది వాటిని install చేసి ఉంచితే వైరస్ లను తొలగిస్తూ వుంటై.


5.అవసరం లేని softwares ని తొలగించండి.దాని వల్ల harddisk స్పేస్ మిగులుతో పాటుగా system కూడా ఫాస్ట్ అవుతుంది.దానికి చేయలిసింది మీకు అవసరం లేని వాటిని uninstall చేసుకోవటమే.
 
6.windows updates మీ system లో ఎప్పటికప్పుడు సరిగ్గా అయ్యేవిదంగా చుడండి అప్పుడు బాగా వేగం గ పనిచేస్తుంది.ఈ updates ని మైక్రోసాఫ్ట్ అందిచటం జరుగుతుంది.కనుక ఎటువంటి లోపాలు ఉండకుండా install చేసుకుంటై అందువల్ల pc fastగా పనిచేస్తుంది.


                            మీ pc ని ఫాస్ట్ గా అలాగే క్లీన్ గా ఉంచటానికి కొన్ని softwares online లో అందుబాటులో వున్నాయి వాటిని త్వరలో పోస్ట్ ద్వార తెలియచేస్తాను.

0 comments:

Post a Comment