1.మీ స్మార్ట్ ఫోన్ లో వైబ్రేషన్ లను ఆఫ్ చేయండి.
ఇలా చేయటం వలన మీ smartphone లో వుండే బాటరీ జీవిత కాలం పేరుగుతుంది.వాస్తవానికి వైబ్రేషన్ లో పెట్టం అనేది అన్ని సార్లు మంచిది కాదు దాని వల్ల ఫోన్ వైబ్రేట్ అయి వేడెక్కుతుంది అప్పుడు బాటరీ కెపాసిటీ తగ్గిపోతుంది.దిని కన్నా చిన్నగా వచ్చే లేదా తక్కువ సౌండ్ గా రింగ్టోన్ లను వాడటం మంచింది.అలాగని మీటింగ్లు ,ఇంటర్వ్యూ లు లాంటివి ముఖ్యమైన వాటికీ మీ స్మార్ట్ ఫోన్ పట్టుకుని వెళ్తే కచ్చితంగా వైబ్రేషన్ లో పెట్టండి ఇక పని పూర్తియిన వెంటనే వైబ్రేషన్ న్ని తీసేయండి.
2.మీ ఫోన్ స్క్రీన్ ని డిం లో పెట్టండి.
మీ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ లో వుండే డిస్ప్లే లో brightness తగ్గించటం ద్వార దిన్ని చేయవచ్చు.ఇలా చేస్తే మీ స్క్రీన్ పై వుండే కంటి తగ్గి బాటరీ జీవితకాలం మెరుగవుతుంది.దాన్ని వల్ల కూడా మీ ఫోన్ ఎక్కువ రోజులు వస్తుంది.
3.టైం సెట్ చేయటం.
మీ స్మార్ట్ ఫోన్ ఎక్కువ రోజులు రావాలంటే చేయాల్సిన మరో ముఖ్యమైన పని టైంని సెట్ చెయ్యటం ఇలా మీ మొబైల్ స్క్రీన్ ఎంత సేపు ఆన్ వుండాలి అనేది పెట్టడం వల్ల కూడా బాటరీ అదా చెయ్యవచ్చు.ఉదాకి:మీరు phoneలో games ఆడారని అనుకుందాం తర్వాత ఆపేసి పనిలో పడిపోయారు మళ్లి వచ్చి చుస్తే ఇంకా స్క్రీన్ వెలిగే వుంటుంది ఇలాంటి కారణాల వల్లే ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది.కనుక అదేనా పని ఫోన్ లో పూర్తియిన వెంటనే స్క్రీన్ లైట్ ఆఫ్ లోకి వెళ్ళే విదంగా సెట్ చేస్తే సరి.
4.స్విచ్ ఆఫ్ చేయండి.
మీ ఫోన్ ని రోజు లో ఒక గంట సేపైనా స్విచ్ ఆఫ్ చెయ్యటం మంచిది.అలాగే ఎవరితోనైనా ఇంపార్టెంట్ డిస్కషన్ లో వున్నప్పుడు,ఇంటర్వ్యూల అప్పుడు,పడుకునే ముందు మొదలైన సందర్బాలలో కూడా స్విచ్ ఆఫ్ చేయటం వల్ల కూడా బాటరీ పవర్ ని మరి కొన్ని రోజులు పెంచుకోవచ్చు.
5.సరిగ్గా ఛార్జింగ్ పెట్టటం.
ఇప్పడు ఫోన్ ఛార్జింగ్ కి సంబందించిన విషయం మాట్లాడుకుందాం ,సాదారణంగా స్మార్ట్ ఫోన్స్ వాడటం కోసం రెండు రకాల బాటరీలను ఉపయోగిస్తారు అందులో ఒకటి Li-ion మరొకటి nickel ఆదారిత బాటరీలు మళ్లి నికెల్ లో రెండు రకాలు వున్నాయి అవి : NiMH,NiCd లు కలవు.ఐతే ఇందులో NiCd అనే బాటరీలు జీవిత కాలం ఎక్కవ కానీ ప్రతిసారి ఛార్జింగ్ లో ఉంచక పోతే సరిగ్గా పని చేయవు.ఇక Li-ion బాటరీ ఒకసారి ఛార్జింగ్ పెట్టి మరల కొంత సమయం వాడుకోవచ్చు.ఇప్పటి స్మార్ట్ ఫోన్ లలో ఎక్కువగా వాడుతున్నది దినినే.అంతే కాదు Li-ion బాటరీ కలిగిన ఫోన్ లు ఛార్జింగ్ చాలా వేగంగా అవుతుంది దాంతో పాటు ఎక్కువ రోజులు రావటం దిని ప్రత్యకత.
6.అవసరం లేని appsని క్లోజ్ చేయండి.
స్మార్ట్ ఫోన్ వాడేవారు చేసే మరొక తప్పు app తర్వాత app ని ఓపెన్ చేసి వాడటం.ఇలా ఫోన్ లో multi-tasking చెయ్యటం మంచిదే కానీ బాటరీ సామర్ద్యం తగ్గిపోతుందే.ఐతే అవసరం ఐన వెంటనే close చేస్తే పర్వాలేదు కానీ మర్చిపోతేనే సమస్య దానికోసం కూడా app stores లో apps సిద్దంగా వున్నాయి.అందులో ఒకటి Advanced task killerఈ appని ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఐతే ఈ పేరు పై క్లిక్ చేస్తే నేరుగా తీసుకోని వెళ్తుంది.ఈ app ముఖ్యంగా మీరు ఓపెన్ చేసిన app క్లోజ్ చెయ్యకుంట వదిలేస్తే ఇది ఆ పని చేస్తుంది అన్న మాట.
7.GPS ఆపండి.
మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోవటంలో దిని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అని చెప్పవచ్చు అదే GPS.ఇది ఇప్పటిలో వాడె అన్ని స్మార్ట్ ఫోన్ లో వుంటుంది.ఎలా అంటే కొన్ని apps లో ఇది ఎక్కించి వుంటుంది ఐతే చాలా మందికి ఈ విషయం తెలియక పోవటం వలన బాటరీ నాణ్యతా లేనిది అన్ని బావిస్తూ ఉంటారు.ఈ GPS అనేది google maps లాంటి వాటిలో ఎక్కువగా పనిచేస్తుంది ఐతే దిని బయటకు వర్కింగ్ వుందో లేదో తెలియక పోవటం కూడా ఛార్జింగ్ అయిపోతు వుంటుంది కనుక GPS వుండే apps వాడేటప్పుడు జాగర్తతో పాటు నియంత్రణగా వాడుకోవాలి.
8.బ్లూటూత్ ,వై-ఫై ఆపండి.
మీ స్మార్ట్ ఫోన్ లో వుండే బ్లూటూత్,వై-ఫై లు బాటరీ జీవితకాలం ని తగ్గించాగాలవు.ఎలా అంటే smartphone లో వీటిని enable చేసి అలాగే వుంచేస్తే నెట్వర్క్ సిగ్నల్స్ కోసం నిరంతరం శోదిస్తూ వుంటై దానికి బాటరీ సహకరం చాలా అవసరం పడుతుంది అందుకే ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది.కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే అవసరం లేన్నప్పుడు ఆఫ్ చేయటం వలన బాటరీ జీవితకాలం పెంచవచ్చు.
9.అవసరమైనవి తాత్కాలికంగా వుంచండి.
ఇంటర్నెట్ తో స్తిరంగా వుండటం కోసం కొన్ని apps వున్నాయి వాటి ద్వార వచ్చే updates ,notification,మొదలైనవి కావాలంటే ఆ apps ని minimize లో కూడా వుంచి వాడవచ్చు ప్రతిసారి వాటిని తెరిచి చూసుకుంటే మొదటి నుండి చేస్తూ రావాలి.ఉదా కి :మీ facebook app వుంటే ప్రతిసారి sign-out,sign-in లు ప్రతిసారి కష్టం కదా అలా చెయ్యటం కన్నా ఆ app minimize చేస్తే ఉపయోగం వుంటుంది.ఐతే అవసరం లేని notification లు రాకుండా ఆపడం చాలా మంచిది.ఈ విదానం వల్ల బాటరీ వాడుక తగ్గి ఎక్కువ కాలం వస్తుంది.
10.వాతావరణం కూడా చూసుకోవాలి.
మీ స్మార్ట్ ఫోన్ ని ఎక్కువగా వేడి వుండే ప్రాంతలో గాని,నేరుగా సూర్యకిరణాలు పడేటట్లు ఉంచకూడదు.ఎప్పుడు చల్లని వాతావరణంలో వుండే విదంగా చూసుకోవాలి ఎట్టి పరస్తితి లో కూడా మీ ఫోన్ ఎక్కువ వేడిలోకి తేకూడదు ఇలా చేస్తే బాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోవడానికి అవకాశం వుంది.
ఇచ్చట ఇస్తున్న సమాచారం కేవలం అవగహన కోసం.ఈ పోస్ట్ చదివిన మీకు ధన్యవాదాలు.ఇక సందేహాలు,సలహాలు,సూచనలు ఇవ్వాలని అనుకుంటే కామెంట్స్ ద్వార తెలియపరచండి.మరో ముఖ్యమైంది ఏంటి అంటే ఈ పోస్ట్ నచ్చితే మీకు తెలిసిన వారికీ share చేయండి.షేర్ చెయ్యటానికి కింద facebook,twitter,google+ నుండి చెయ్యవచ్చు.
Tags : #bluetooth| #wi-fi| #tech news| #smartphones| #battery tips| #telugu technology
0 comments:
Post a Comment