Sunday, December 15, 2019

wps office లో ఫాంట్స్ ని ఎలా పెట్టాలో చూడండి



నమస్తే, wps office suite ని మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ లేదా ఇతర ప్లాట్ ఫారం లపై ఇన్స్టాల్ చేసి వాడుకోవచ్చు. ఇది ms ఆఫీస్ తరహాలోనే డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇందులో ఫైల్స్ convert చేసుకునే సదుపాయాలు ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే మిగతా కావాలి అనుకుంటే ప్రీమియం వెర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్రీ వెర్షన్ లో డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్స్, ప్రజెంటేషన్ లు చేయవ్వచ్చు. అలాగే ఈ యొక్క wps office లో ప్రి డిజైన్ టెంప్లేట్స్ కూడా అందుబాటులో ఉండటం విశేషం. ఉదాహరణకు మీకు resume తయారు చేయాలి అనుకుంటే ఈ టెంప్లేట్ లో నుండి తీసుకిని అక్కడి ఉన్న వాటిని తీసేసి మీకు కావలసిన డీటెయిల్స్ ని యాడ్ చేస్తే మీ resume అయిపోయినట్లే.

ఇక టాపిక్ మెయిన్ కంటెంట్ లోకి వెళ్లిపోతే ఈ యొక్క wps ఆఫీస్ లో ఫాంట్స్ అనేవి కావాలి అంటే కొనుగోలు చేయాల్సి ఉంటుంది కానీ అటువంటి అవసరం ఏమి లేకుండా wps ఆఫీస్ డెవలపర్స్ ఒక అవకాశం అనేది ఇవ్వటం జరిగింది దాంతో మీకు నచ్చిన fonts ని ఈ యొక్క wps office లో పెట్టి డాక్యుమెంట్ చేసే సమయంలో అప్లయ్ చేయవచ్చు. కింద స్టెప్స్ వారీగా ఇవ్వటం జరిగింది చూడండి. కింద నేను wps office app  లో ఫాంట్స్ ని పెట్టడం గురుంచి వివరించటం జరుగుతోంది గమనించండి.
1. wps office ని ఆండ్రాయిడ్ మొబైల్ ఐతే ప్లే స్టోర్ నుండి మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి.
2.ఇంస్టాల్ అయిన తరువాత కావలసిన fonts ని 1001fonts.com , dafonts.com వంటి వెబ్సైట్ లనుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ కాబడిన ఫైల్స్ జిప్ లో ఉంటాయి కనుక వాటిని extract అంటే విడదీయండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్ కి చెందిన ఫోల్డర్ మీరు ఎక్కడ extract చేస్తే అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేయండి అందులో మీరు ఎంపిక చేసి డౌన్లోడ్ చేసిన fonts ఉంటాయి ఈ ఫాంట్స్ format వచ్చేసరికి .ttf లేదా .otf కలిగి ఉంటాయి కనుక వాటిని మాత్రమే సెలెక్ట్ చేసి copy చేయండి.
3. ఈ copy చేసిన fonts ని wps office లో పెట్టటం కోసం file manager ని ఓపెన్ చేయండి.
4. అందులో folder ఉండే విభాగం లో కి వెళ్ళండి
5. లేదా సెర్చ్ లో android అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇప్పుడు వచ్చే లిస్ట్ లో android folder కనిపిస్తుంది అది క్లిక్ చేయండి.
6. ఇప్పుడు file manager లో కనిపించే మెనూ లో "show hidden files" క్లిక్ చేయండి.
7. ఆండ్రాయిడ్ ఫోల్డర్ పై క్లిక్ చేస్తే మిగతా ఫోల్డర్లు ఓపెన్ అవుతాయి అందులో data folder ని ఓపెన్ చేయండి.
8. ఇప్పుడు అందులో ఉండే cn.wps.moffice_eng అనే ఫోల్డర్ ని ఓపెన్ చేయండి.
9. ఇక్కడ .cache అనే hidden ఫోల్డర్ కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేయండి.ఇప్పుడు kingsoft office ఫోల్డర్ కనిపిస్తుంది అది ఓపెన్ చేయండి.
10.ఈ ఓపెన్ చేసిన ఫోల్డర్ లో .fonts అనే ఫోల్డర్ ఉంటుంది అది ఓపెన్ చేసి మీరు copy చేసిన ఫాంట్స్ ని paste చేయండి.

అంతే మీకు నచ్చిన లేదా కావాల్సిన fonts ని విజయవంతంగా wps office లో పెట్టేసారు . ఇప్పుడు wps ఆఫీస్ యాప్ ని ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేయండి అందులో ఫాంట్స్ లోకి వెళ్లి మీరు copy and paste చేసిన font ని సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ లో టైపింగ్ స్టార్ట్ చేయండి అంతే.


ఈ టాపిక్ నచ్చితే ఒక్క షేర్ మరియు కామెంట్ చేయండి.

Friday, December 13, 2019

పేటియం బిగ్ బాస్కెట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ డిసెంబర్ 2019


నమస్తే, paytm bigbasket కలిసి తమ యూజర్ల కోసం క్యాష్ బ్యాక్ ఆఫర్ ని అందివ్వటం జరుగుతోంది. ఈ ఆఫర్ కావాలి అనుకుంటే రెండు దాంట్లో కూడా అకౌంట్ ఉండాల్సి ఉంటుంది. అందుకోసం పేటియం బిగ్ బాస్కెట్ లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆఫర్ ని పేటియం మరియు బిగ్ బాస్కెట్ కి చెందిన వెబ్సైట్ లేదా యాప్ లో కూడా పొందవచ్చు. ఇక ఈ ఆఫర్ లో పేటియం క్యాష్ బ్యాక్ గా 5% వరకు వస్తుంది. ఇక ఈ ఆఫర్ ఎలా పొందలో కింద వివరంగా ఇవ్వటం జరిగింది.
1. మీ paytm అకౌంట్ లో లాగిన్ అవ్వండి వెబ్సైట్ లేదా యాప్ అయిన పర్వాలేదు.
2. ఇప్పుడు సెర్చ్ లో vouchers అని సెర్చ్ చేయండి.
3.ఇప్పుడు grocery and home అని ఉంటుంది దాని పై క్లిక్ చేయండి.
4.ఇప్పుడు వచ్చే పేజీ లో bigbasket పై క్లిక్ చేస్తే బిగ్ బాస్కెట్ కి చెందిన vouchers ఉంటాయి అందులో మీకు ఏది అవసరం ఉంటే అది సెలెక్ట్ చేయాలి అంతే.
5.తరువాత buy now వస్తుంది అందులో ఈ యొక్క voucher ని కొనుగోలు చేస్తే మీ paytm account కి క్యాష్ బ్యాక్ ఆఫర్ 5% వస్తుంది.

మరి voucher కొన్నారు బాగానే ఉంది అలాగే paytm cashback offer కూడా వచ్చేసింది. ఆగండి అసలు విషయం ఇక్కడే ఉంది. ఎందుకు అంటారా voucher ని ఇప్పుడు bigbasket app/website లోకి వెళ్లి redeem చేసుకోవాలి అప్పుడే కదా మీ cashback ఆఫర్ కి నిజమైన విలువ. Ok ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో కింద చూడండి.

1.ఇప్పుడు bigbasket కి చెందిన యాప్ లేదా వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
2.బిగ్ బాస్కెట్ లో లాగిన్ అయ్యి మీ ప్రొఫైల్ పై క్లిక్ చేయండి.
3.ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అందులో ఒకటి my gift cards. ఈ గిఫ్ట్ కార్డ్స్ పై క్లిక్ చేయండి.అక్కడ రెండు బాక్సలు కనిపిస్తాయి.
4.కదా ఇప్పుడు paytm లోకి వెళ్లి మీరు కొన్న voucher ని ఓపెన్ చేయండి అందుకోసం paytm లో my orders పై క్లిక్ చేయండి అందులో మీరు కొన్న వోచర్ వివరాలు ఉంటాయి అలాగే voucher code అండ్ pin number ఉంటాయి వాటిని పైన 3rd పాయింట్ లో చెప్పిన రెండు బాక్స్ లో ఎంటర్ చేసి Redeem పై క్లిక్ చేయండి.

అంతే మీరు కొన్న voucher amount ఎంత ఐతే అంత bigbasket wallet లోకి వెళ్లిపోతుంది. మీరు ఏదైనా bigbasket కొన్న సమయంలో ఆ అమౌంట్ కట్ అవుతుంది.


ఐతే ఈ ఆఫర్ కి చెందిన terms and conditions అనేవి paytm మరియు bigbasket లో తప్పకుండా ఒకసారి చదివి ఈ cashback ఆఫర్ ని పొందండి.

ఈ టాపిక్ నచ్చితే షేర్ మరియు కామెంట్ చేయండి.

Thursday, December 12, 2019

యూట్యూబ్ లో వచ్చిన రెండు కొత్త ఆప్షన్స్


నమస్తే, ఇటీవలే యూట్యూబ్ కొత్త ఆప్షన్స్ అనేవి సెట్టింగ్స్ లో యాడ్ చేయటం జరిగింది. ఈ యొక్క సెట్టింగ్స్ అనేవి యూట్యూబ్ వీడియో ఎడిటర్ లోని అడ్వాన్స్ సెట్టింగ్స్ లో పెట్టడం జరిగింది అలాగే ఈ యొక్క ఆప్షన్స్ వీడియో పబ్లిష్ చేసే ముందు వాడుకోవచ్చు. ఇక కొత్త గా వచ్చిన ఈ ఆప్షన్స్ ఇప్పటికే ఉన్న పాత వీడియో లకు కూడా అప్లై చేయచ్చు.
ఇక ఈ రెండు కొత్త రూల్స్ ఏంటి అంటే
* కిడ్స్ కొరకు
1.మీరు పెట్టిన వీడియో పిల్లలు కూడా చూడాలి అంటే yes ఆప్షన్ అనేది ఎంపిక చేయాల్సి ఉంటుంది అలాగే పిల్లల కంటెంట్ వీడియో లో ఉన్న ఈ yes ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది.
2.మీరు పెట్టె వీడియో పిల్లలు చూడకుండా కూడా చేయచ్చు అందుకోసం No ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ ఆప్షన్ పిల్లలు చూడకూడనవి ఏమైనా వీడియో లో ఉన్న కూడా వీడియో పబ్లిష్ చేసే ముందు ఈ No ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది.
* అడల్ట్
ఇక యూట్యూబ్ యాడ్ చేసిన ఈ రెండో ఆప్షన్ తో మీరు పబ్లిష్ చేయబోయే వీడియో వయసు కి చెందిన వివరాలు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు చేసే వీడియో కి 18 సవంత్సరాలు దాటినా వారు చూడాలా లేదా ఎవరైనా చూడవచ్చా అని ఉంటుంది అందులో yes సెలెక్ట్ చేస్తే కేవలం 18 వయసు దాటినా వారు మాత్రమే వీడియో ని చూడగలరు అలా కాకుండా అందరూ చూడాలి అనుకుంటే No సెలెక్ట్ చేస్తే సరిపోతుంది.

యూట్యూబ్ ఈ రూల్స్ లేదా సెట్టింగ్స్ ని COPPA మరియు ఇతర చట్టాల వలన తీసుకు రావటం జరిగింది.


ఈ టాపిక్ మీకు నచ్చితే ఒక షేర్ మరియు కామెంట్ చేయండి.


Tuesday, December 10, 2019

ఇప్పుడు గూగుల్ ఫొటోస్ నుండి నేరుగా చాటింగ్ కూడా చేయచ్చు


నమస్తే, గూగుల్ ఫొటోస్ లో ఇక నుండి ఫొటోస్ మరియు వీడియోస్ స్టోర్ చేయటమే కాకుండా చాటింగ్ కూడా చేయచ్చు. అందుకోసం మీరు క్రింద విధంగా చేయండి.
1. ముందుగా గూగుల్ ఫొటోస్ యాప్ ని ఓపెన్ చేయండి.
2. పిక్చర్ లేదా వీడియో ని లో ఏది మొదటిగా సెండ్ చేయాలి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేయండి.
3.ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసారే అనుకుందాం దాని కింద షేర్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి.
4.ఇప్పుడు వచ్చే స్క్రీన్ లో మీ దగ్గర ఉండే అవతలి వ్యక్తి యొక్క ఈమెయిల్ ఐడి లేదా నేమ్ వంటి వాటి ఎంటర్  చెసి షేర్ చేసే సమయంలో మెసేజ్ పెట్టండి.
అంతే మీడియా ఫైల్ తో పాటు మెస్సేజ్ కూడా వెళ్తుంది.
5.అదే చాటింగ్ లో ఇంకా ఏమైనా ఫొటోస్ యాడ్ చేయాలి అనుకుంటే ఫొటోస్ ఐకాన్ తో కూడిన ప్లస్ సింబల్ పై క్లిక్ చేస్తే మీడియా ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు మీడియా లో పంపాల్సిన ఫైల్ సెలెక్ట్ చేసి టాప్ లో ఉండే యాడ్ బటన్ పై క్లిక్ చేయండి.

Monday, December 9, 2019

ఈ కార్డ్స్ ని ఆపేస్తున్న SBI


నమస్తే, SBI డిసెంబర్ 31 2019 తరువాత నుండి మాగ్నెట్ స్ట్రిప్ ఉన్న కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేస్తున్నట్లు ప్రకటించింది. మీ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి కొత్త కార్డ్ EMV చిప్ కలిగిన వాటిని తీసుకోండి. ఇక పాత రకం కార్డ్స్ ని ఎస్ బి ఐ ఆపేవేయటనికి కారణం ఫ్రాడ్స్ జరగటమే కాకుండా సెక్యురిటి విషయంలో కూడా తమ కస్టమర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని ఈ కొత్త ఈవీఎం చిప్ తో కూడిన కార్డ్స్ ని ఇవ్వటం జరుగుతుంది.
ఇక ఈ కార్డ్స్ కోసం దగ్గరలోని మీ యొక్క sbi బ్రాంచ్,నెట్ బ్యాంకింగ్, యెనో యాప్ లో అప్లై చేసి ఫ్రీ గానే కొత్త ఈవీఎం చిప్ కలిగిన కార్డ్ ని పొందవచ్చు.

Sunday, December 8, 2019

మీకు తెలుసా! గూగుల్ 2019 లో ఏమి క్లోజ్ చేసిందో


నమస్తే, మీకు తెలుసా 2019 లో గూగుల్ నుండి 23 ప్రొడక్ట్స్ మరియు సర్వీస్ లను నిలిపివేయడం జరిగింది. ఐతే గూగుల్ వీటిని వివిధ రకాల కారణాలతో ఆపివేయటం జరిగింది. అవి
గూగుల్ ప్లస్,గూగుల్ షార్ట్ లింక్, గూగుల్ అల్లో, ఇన్బాక్స్ బై జిమెయిల్, క్రోమ్ కాస్ట్ ఆడియో, యూట్యూబ్ గేమింగ్, అరియో, యూట్యూబ్ మెస్సేజ్స్, గూగుల్ డేడ్రీమ్,గూగుల్ క్లిప్స్, గూగుల్ ట్రిప్స్, బ్లాగ్ కంపాస్, గూగుల్ క్లౌడ్ మెసేజింగ్, గూగుల్ స్పాట్ లైట్ స్టోరీస్, గూగుల్ జంప్, డ్రాగన్ ఫ్లై , జి సూట్ ట్రైనింగ్, ఫాలో యువర్ వరల్డ్, డేటాలి, గూగుల్ బులెటిన్, గూగుల్ ఫ్యూషన్ టేబుల్స్, గూగుల్ ట్రాన్సలాటర్ టూల్ కిట్, గూగుల్ కోర్ రిలేట్.



గూగుల్ లో మీకు ఏ ప్రొడక్ట్ లేదా సర్వీస్ నచ్చిందో కామెంట్ లో తెలపండి.

Thursday, December 5, 2019

గూగుల్ అకౌంట్ నుండి డివైస్ లను తొలగించటం ఎలా చూడండి.


నమస్తే, మీ యొక్క గూగుల్ అకౌంట్ తో మల్టి డివైస్ లాగిన్ అయ్యి ఆ డివైస్ లని వద్దు అనుకుంటే ఎలా తొలగించాలో చూడండి. కింద స్టెప్స్ వారీగా ఇవ్వటం జరిగింది.
1.ముందుగా మీ యొక్క మొబైల్,లాప్టాప్ లేదా టాబ్లెట్ వంటి డివైస్ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయండి.
2. myaccount.google.com లోకి వెళ్లి గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వండి.
3. ఇప్పుడు టాప్ రైట్ కార్నర్ లో ఉండే security పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు వెరిఫికేషన్ కోసం గూగుల్ పాస్వర్డ్ అడుగుతుంది ఇవ్వండి.
5. ఇప్పుడు టు స్టెప్ వెరిఫికేషన్ పై క్లిక్ చేయండి.
6. ఇప్పుడు కిందకి వెళ్తే revoke all అని ఉంటుంది దాని పై క్లిక్ చేయండి.


అంతే గతంలో సేవ్ అయిన మీ యొక్క డివైసులు ఏమైతే గూగుల్ అకౌంట్ తో లింక్ అయ్యి ఉన్నాయో అవి తొలగించాబడతాయ్.ఐతే ఇది అయిన వెంటనే గూగుల్ అకౌంట్ తో అంతేంటికెట్ అవ్వాల్సి ఉంటుంది అందుకు  రిజిస్టర్ అయిన మొబైల్ కి సెక్యూరిటీ కోడ్ వస్తుంది అది ఇస్తే సరిపోతుంది.

ఈ టాపిక్ నచ్చితే షేర్ మరియు కామెంట్ చేయండి.

Tuesday, December 3, 2019

ఇంకా కొనసాగుతున్న సైబర్ మండే ఆఫర్స్


నమస్తే, సైబర్ మండే ఇంకా అయిపోలేదు ఆఫర్స్ కొనసాగుతున్నయి ఈ టాపిక్ మీరు చదివే సమయానికి అయిపోతే ఎమ్ చెప్పలేను. ఈ యొక్క సైబర్ మండే ఆఫర్స్ ని చాలా కంపెనీలు తమ యొక్క ప్రొడక్ట్స్ మరియు సర్వీస్స్ అమ్మకాల కోసం ఇంకా ఉంచటం జరిగింది. ఇక ఈ ఆఫర్స్ ఇండియన్ కస్టమర్స్ కోసం కూడా అందిస్తున్న విషయం తెలిసందే. ఈ యొక్క సైబర్ మండే ఆఫర్స్ అన్ని రకాల ప్రొడక్ట్స్ మరియు సర్వీస్ లపై అందిస్తున్నాయి ఆయా కంపెనీ లు ఇక కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం కానీ కొనేముందు అన్ని పరిగణలోకి తీసుకుని కొనుగోలు చేయండి.

ఈ టాపిక్ మీ అవగహన కోసం మాత్రమే ఇవ్వటం జరిగింది నచ్చితే షేర్ మరియు కామెంట్ చేయండి.

Monday, December 2, 2019

బ్లాక్ ఫ్రైడే అయిపోయింది సైబర్ మండే వచ్చింది

నమస్తే, బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ మిస్ అయ్యాను అని అనుకుంటే ఈ రోజు సైబర్ మండే ఆఫర్స్ ఉన్నాయి కొనాలి అనుకుంటే చూడండి. ఈ యొక్క సైబర్ మండే ఆఫర్స్ భారతీయ కస్టమర్ లకి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఆఫర్స్  గూడ్స్ మరియు సర్వీసస్ పై కూడా లభిస్తున్నాయి. అలాగే ఇదే సమయంలో ఫేక్ వెబ్సైట్ లతో మోసం చేసే అవకాశం ఉంది కనుక కొనుగోలు చేసే సమయంలో జగర్తలు తీసుకోవటం తప్పని సరి. ఇక ఈ సైబర్ మండే ఆఫర్స్ కూడా భారీ తగ్గింపు ధరల్లో ఇవ్వటం జరుగుతుంది ఏదైనా ఖరీదైన ప్రొడక్ట్ లేదా సర్వీస్ కొంటానికి ఇదే మంచి సమయం. ఈ సైబర్ మండే డీల్స్ ఎన్నో ప్రముఖ కంపెనీ లకి చెందిన ప్రొడక్ట్ మరియు సర్వీస్ లపై అందిస్తున్నాయి. ఇక ఈ సైబర్ మండే ఆఫర్స్ ఆ వెబ్సైట్ రోజు అంత పెడితే కొన్ని మాత్రం కొంత సమయం మాత్రమే ఇస్తున్నాయి కాబట్టి అలాంటి సమయంలో ఆఫర్స్ మిస్ అవ్వకండి.ఇక ఈ సైబర్ మండే ఆఫర్స్ డొమైన్ నేమ్స్, వెబ్ హోస్టింగ్, సాఫ్ట్వేర్ మరియు అన్ని రకాల ప్రొడక్ట్స్ పై ఇవ్వటం జరుగుతోంది.
ఈ టాపిక్ అవగహన కోసం మాత్రమే ఇవ్వటం జరిగింది.


ఈ టాపిక్ నచ్చితే షేర్ మరియు కామెంట్ చేయండి.