Sunday, October 5, 2014

గూగుల్ క్రోమ్ తో పేజి ర్యాంక్ తెలుసుకొవాలని వుందా.

how to view pagerank using google chrome

హాయ్ ఫ్రెండ్స్ ,
                             రోజు సిస్టం ఆన్ చేయటం దాంట్లో ఏదోక బ్రౌజరుని ఓపెన్ చేసి కావలసిన సమాచారం చూసుకోవటం ఇంకా డౌన్లోడ్ లు చేయటం.అవును ఫ్రెండ్స్ బ్రౌజరు లో వాడటానికి చాలా సదుపాయాలు వున్నాయి అవి ఎందుకు వాడుకో కూడదు .అవును అవి మీరు వాడవచ్చు.మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజరు వాడుతున్నారా ఐతే పలానా వెబ్ సైట్ కి చెందిన ర్యాంక్ ఎంతో తెలుసుకోవాలని వుంటే మరి ఆలస్యం ఎందుకు కింద ఇచ్చిన సమాచారాన్నిచదవండి.చిన్న విషయం చదివింది పూర్తీగా అర్ధం అవుతుంది చెయ్యగలను అనుకుంటేనే చేయండి.ఒక పాయింట్ చదివి మిగతాది చదవకుంట వదిలేసినా చెయ్యలేరు ఏమంటారు.ఇక విషియానికి వస్తాను.
ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ లు పెద్దవిగా చూడాలంటే వాటి పై క్లిక్ చేయండి.
1.మీ సిస్టం కి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకుని వుంటే గూగుల్ క్రోమ్ బ్రౌజరు ని ఓపెన్ చేయండి.
2.ఏంటి సిస్టం లో బ్రౌజరు లేదా ఐతే ఈ లింక్ క్లిక్ చేయండి దానితో నేరుగా డౌన్లోడ్ చెయ్యవచ్చు.
                                            http://www.google.com/chrome/browser/ 
3.పైన లింక్ లోకి వేలిన తర్వాత అక్కడ డౌన్లోడ్ క్రోమ్ అని వుంటుంది దాని పై క్లిక్ చేయండి.
4.డౌన్లోడ్ పూర్తియింది కదా ఇప్పుడు అది ఎక్కడ సేవ్ అయిందో అక్కడికి వెళ్లి ఆ సెటప్ ని install చేయండి.
5.ఇంస్టాల్ పుర్తినట్లు వుంటే మీ desktop పై క్రోమ్ ఐకాన్ కనిపిస్తుంది.ఇప్పుడు దాని పై క్లిక్ చేయండి.
6.బ్రౌజరు ఓపెన్ చేసారు కదా దాంట్లో  అడ్రస్ బార్ కింద apps అని వుందా వుంటే దాని పై క్లిక్ చేయండి తర్వాత ఒక పేజి వస్తుంది.
7.ఆ apps అని లేక పోతే కింద చూపిన ఇమేజ్ లు అనుసరించండి.కింద ఇమేజ్ ల్లో గుర్తులను,సంఖ్యలను,పదాలను మొదలైనవి గమనించి చేస్తే పని సులువు అవుతుంది. 
    8.పై ఇమేజ్ చూసారా అందులో నెంబర్లని చుడండి ఆ వరుసలో క్లిక్ చేస్తూ వెళ్ళితే కొత్త విండో ఓపెన్ అవుతుంది.అందులో కింది ఇమేజ్ విదంగా వస్తుంది.అందులో సెట్టింగ్ పై క్లిక్ చేయాలి.

9.సెట్టింగ్ క్లిక్ చేస్తే మరొక పేజి వస్తుంది అందులో కింది ఇమేజ్ లో గుర్తించిన విధంగా చేయండి అప్పుడు 'apps' ఉండటాన్ని అడ్రస్ బార్ కింద చూడవచ్చు .అది ఎలాగో చుడండి.


10. పైన చూసారు కదా ఇప్పుడు apps అని రావటాన్ని. దాని పై క్లిక్ చేయండి.
                 ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు ఇప్పుడు అసలుదానికి వెళ్తునం ఫ్రెండ్స్ మీరు సిద్దమేనా .ఐతే మొదలు పెట్టండి.
11.apps పైన క్లిక్ చేసారు కదా వెంటనే ఒక పేజి వస్తుంది అందులో 'store' ని వుంటుంది దానిని ఎంచుకోవాలి.కింద ఇమేజ్ చుస్తే అర్ధం అవుతుంది.
12.పై విదంగా చేసారు కదు ఇప్పుడు ఒక పేజి ఓపెన్ అవుతుంది.అందులో search వుంటుంది దాంట్లో  pagerank లేదా pagestatus అని టైపు చేసి enter లేదా go సింబల్ పై క్లిక్ చేస్తే కొన్ని టైపు చేసిన పదాలుకి చెందిన add-ons వస్తాయి వాటిలో నచ్చిన ఒక దానిని install చేస్తే సరిపోతుంది .తర్వాత మీ బ్రౌజరు రీస్టార్ట్ చేసి మీకు నచ్చిన వెబ్ సైట్ కి వెళ్లి గాని లేదా మీకు పర్సనల్ గా వెబ్ సైట్ వున్నా దానికి సంబందించిన ప్రస్తుత pagerank తెలుసుకోవచ్చు.
కింద వున్నా వరుస ఇమేజ్ లను చుస్తే తెలుస్తుంది.


    పైన ఇమేజ్ చూసారా ఫ్రీ అన్న దాని పై క్లిక్ చెయ్యగానే add or cancel అని వస్తుంది .మీకు add-on కావలంటే add పై క్లిక్ చేయండి.ఇప్పుడు అది ఇంస్టాల్ అవుతుంది .ఇంస్టాల్ అయిన విషియం తెలియటం కోసం new tab పై క్లిక్ చేయాలి లేదా బ్రౌజరు మొత్తని క్లోజ్ చేసి మళ్లి ఓపెన్ చేస్తే ఎలా మార్పు వుంటుందో చూడవచ్చు.అలాగే pagerank కూడా ఎలా చూడాలో కింది ఇమేజ్ లు చుస్తే తెలుసుతుంది.

పై ఇమేజ్ మొత్తం చూసారు కదా  ఇక్కడ facebook rank ని ఉదాహరణకు చూపించటం జరిగింది .అలాగే మీకు నచ్చిన సైట్ ర్యాంక్ చూడాలంటే చెయ్యవచ్చు.

                                                  ఇచ్చట ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసమే.ఈ పోస్ట్ మీకు తెలిసిన వారికీ షేర్ చెయ్యగలరు. ఈ పోస్ట్ చదివిన మీకు నా కృతజ్ఞతలు.ఈ పోస్ట్ లో ఏమైనా తప్పులు వున్నా,సందేహాలు వున్నాకామెంట్స్ ద్వారా తెలపగలరు.

Tags : #pagerank| #google chrome| #tech news| #satyameva jayate

0 comments:

Post a Comment