Tuesday, October 7, 2014

విండోస్ 10ని ఎలా ఇంస్టాల్ మరియు డౌన్లోడ్ చేయటం

windows10|windows10 free download|downlaod windows 10|windows 10 preview

హాయ్ ఫ్రెండ్స్ ,
                   గత సెప్టెంబర్ 30న విండోస్8 కి అప్డేట్ వెర్షన్ గా విండోస్ 10ని తెస్తునట్లు ప్రకటించింది మైక్రోసాఫ్ట్.ఈ సమాచారాన్ని విండోస్ ఆఫిసిఅల్ బ్లాగ్ ద్వారా కూడా తెలిపింది.ఈ వెర్షన్ ని 2015నుండి మార్కెట్ లోకి తెస్తునట్లు సమాచారం.ఇచ్చట ఇచ్చిన ఇమేజ్ లు పెద్దవిగా చూడాలంటే వాటి పై క్లిక్ చేయండి.
విండోస్ 10 సాంకేతిక విషయాల్ని అర్ధం చేసుకోండి :
                      విండోస్ కి చెందిన ఈ కొత్త వెర్షన్ న్ని మీ సిస్టం లోఎక్కించే ముందు కొన్ని జాగర్తలు తీసుకోవటం చాలా ముఖ్యం.ఈ ఆపరేటింగ్ సిస్టంలో చాలా మార్పులు చెయ్యటం జరిగింది.అందులో బాగంగానే windows feedback app ని పెట్టటం జరిగింది.దీనితో మైక్రోసాఫ్ట్ తను డిజైన్ చేసిన ఈ ఆపరేటింగ్ సిస్టంలో  మార్పులు చేర్పులు చేసి మరింత బాగా పనిచేసే విధంగా చెయ్యాలని బావిస్తునట్లు సమాచారం.
                       విండోస్ 10లో చాలా కొత్త ఫీచర్స్ ని జత చేయటం అందులో ముఖ్యంగా start menu లో వుండే వాటిని ఇక్కడ టైల్స్ రూపంలో చూడవచ్చు.అలాగే file explorer మరియు search ఫీచర్స్ బారి నూతన విధంగా మార్పులు చేసింది మైక్రోసాఫ్ట్.ఇంకా విండోస్ mutliple విండోస్ ఓపెన్ చేసి వాడె విదానం చాలా ఆకర్షనియంగా వుంటుంది.దాంట్లో బాగమే కింది ఉదాహరణగా ఇచ్చిన ఇమేజ్.
windows 10,windows 10 download,download windows 10,windows 10 technical preview,free download,windows 10 product key,tips,tricks,release date,reviews,
 హెచ్చరిక :
ఈ వెర్షన్ ని సిస్టంలో ఎక్కించే ముందు పాత దానిని పూర్తిగా backup చేసి వుంచుకోవటం చాలా అవసరం.ఎందుకంటే కొందరు ఈ వెర్షన్ ని ఎక్కించి తరవాత వాడటం రాక మల్లి పాత వెర్షన్ కోసం వెతకాలి అంతక ముందు ఈ backup చేసి వుంచుకుంటే మంచిది.
విండోస్ 10 టెక్నికల్ ప్రివ్యూ ని డౌన్లోడ్ చేయండి ఇలా :
1.కింద ఇచ్చిన లింక్ సహాయంతో windows insider program లో join అవ్వండి.(గమనిక : join అవ్వాల అన్నది మీ ఇష్టం )
2.సిస్టం లో విండోస్ 10న్ని ఎక్కంచాలి అంటే ఇవి తప్పకుండా వుండాలి .
  • processor : 1GHz or higher ;
  • free hard disk space : 16GB ;
  • RAM : 1GB(32-bit) , 2GB(64-bit) ;
  • microsoft account and internet access ;
  • graphics card : microsoft directx 9 graphics device with WDDM driver
ఈ వెర్షన్ కేవలం మూడు బాషలలో డౌన్లోడ్ కి అందుబాటులో వున్నది .ఆ బాషలు english,brazilian portugese,simplified chinese.అంటే ఈ os మూడు బాషలలో వుంటుంది అన్నామాట.
english - 32bit ,english - 64bit అలాగే మిగతాబాషలకు చెందినవి డౌన్లోడ్ చేయాలి అంటే కింద లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
ఈ లింక్ లోకి వెళ్ళినప్పుడు పేజి లో కింది ఇమేజ్ లో చూపిన విధంగా వస్తుంది గమనించండి.
windows 10,windows 10 download,download windows 10,windows 10 technical preview,free download,windows 10 product key,tips,tricks,release date,reviews,
పై ఇమేజ్ ని గమనించారా వాటిని బాగా చదివి అనుసరించాలి.ఇక డౌన్లోడ్ సందర్బంలో మరో ముఖ్యమైనది ప్రోడక్ట్ కీ అది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది.
మిగతా సమాచారం మీ కోసం :
ఒకసారి డౌన్లోడ్ అలాగే ఇంస్టాల్ పూర్తీ ఐతే updates ఆటోమేటిక్ గా జరిగిపోతాయి.ఈ os కి చివరి తేది ఏప్రిల్ 15 2015 వరకు అని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
                                        ఈ పోస్ట్ చదివిన మీకు కృతజ్ఞతలు.ఈ పోస్ట్ ని మీకు తెలిసిన వారికీ షేర్ చెయ్యవచ్చు.ఇలా అనడానికి కారణం అందరు కొంచెమైన టెక్నాలజీ కి చెందిన సమాచారం చదువుతారు అని నా ఉద్దేశం ఎం అంటారు.
                                               ఇక ఈ పోస్ట్ లో తప్పులు ,సలహాలు,మొదలైనవి తెలియచేయాలి అంటే కామెంట్స్ ద్వార తెలియ చెయ్యవచ్చు.  


Tags : #windows10| #microsoft windows

0 comments:

Post a Comment