హాయ్ ఫ్రెండ్స్,
మీ సిస్టం కి ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ పెట్టించుకున్నారా .నెల నెల చాలా బిల్ లు కడుతన్నారా .కనెక్షన్ తీసుకున్నపుడు చాలా కంపెనీలు 3.1 MBPS ఇస్తాం అంటూ చెప్పుతై .దానికి నచ్చి కొనుకొని ఇంటికి వచ్చి వాడిన తరవాత చాలా తక్కువ స్పీడ్ ని ఇస్తూ ఉంటాయి.ఆ స్పీడ్ వచ్చేది ప్రాంతల బట్టి కూడా ఆదారిపడి వుంటుంది. అది ఒక వైర్ లైన్ ,వైర్ లెస్ , రూటర్ ఏమైనా సరే తక్కువ స్పీడ్ వస్తు వుంటై .ఇక స్మార్ట్ ఫోన్ లో వాడె ఇంటర్నెట్ కూడా ఎంత స్పీడ్ వస్తోందా తెలియదు.ఐతే మీ లాప్ టాప్ ,డెస్క్టాప్ , టాబ్లెట్ ల్లో ఇంటెల్ ప్రాసెసర్ తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ లో ఉంచితే ఇక్కడ చెపేది చేయటం వల్ల మీ పరికరాల్లో ఇంటర్నెట్ ఎంత స్పీడ్ వస్తోంది అనేది తెలుసుకోవచ్చు. ఇది ఒక్క మీ ఇంట్లో వుండే కంప్యూటర్ తాలుక ఇంటర్నెట్ స్పీడ్ నే కాక బయట ఇంటర్నెట్ కేఫ్ లో కూడా ఎంత స్పీడ్ వస్తోందో టెస్ట్ చెయ్యవచ్చు. అలాగే మీరు ఫోన్ కనెక్షన్ లేదా dongles తో ఇంటర్నెట్ వాడిన ఇది చెయ్యవచ్చు.
ఐతే ఇక ఆసలు విషియానికి వెళ్తునాను ఫ్రెండ్స్.ఒక చిన్న సమాచారం ఇచ్చట ఇమేజ్ లు పెద్దవిగా చూడాలంటే వాటి పై క్లిక్ చేయాలి.
1.ఇది చేసే ముందు ఒకసారి ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా వుందోలేదో చూసుకోండి లేకపొతే పెట్టండి.
2.పెట్టారు లేదా చూసారు కదా ఇప్పుడు మీ సిస్టం లో వుండే బ్రౌజరు(firefox,chrome,safari,opera,internet explorer)లో ఏదైనా ఒకదాని ఓపెన్ చేసి ఈ పోస్ట్ లో వున్నా #speed test అనే ఈ పదం పై క్లిక్ చేస్తే నేరుగా మీరు ఏమి చెయ్యాలో అక్కడి కి తీసుకుని వెళ్తుంది.ఇలా కాకుండా మరొక విదానం తో ఐతే కింది పాయింట్ నుండి అనుసరించండి.
3.ఇప్పుడు మీ బ్రౌజరుని తెరిచారు కదా అక్కడి అడ్రస్ బార్ లో ఈ లింక్ ని టైపు చేసిన లేదా ఇక్కడే click చేసిన కూడా ఫలితం ఉంటుంది http://www.intel.in/content/www/in/en/homepage.html ఇలా చేసిన వెంటనే కింది విదంగా తేరా వేస్తుంది.
4.పై ఇమేజ్ చూసారు కదా ఆ విధంగా తేరా వస్తుంది.అందులో 'menu' పై క్లిక్ చేస్తే వాటిలో వుండే మిగతా ఆప్షన్ లు కనిపిస్తాయి దాంట్లో 'topics' అనే విబాగం ఎంచుకోవాలి.అది ఎలాగో కింద ఇమేజ్ లో చుడండి.
5.topics ని ఎంచుకున్న వెంటనే పక్కన మరొక తేరా వస్తుంది అందులో research అనే category లో వుండే tech tips ని సెలెక్ట్ చెయ్యాలి.అది ఎలాగో కింది ఇమేజ్ లో చుస్తే అర్ధం అవుతుంది.
6.tech tips క్లిక్ చేసిన వెంటనే మరొక తెర వస్తుంది అందులో ఈ కింది ఇమేజ్ లోని బాణం గుర్తును గమనించండి .ఆ గుర్తు చూపిన దానిపై క్లిక్ చేయండి.ఇప్పుడు మరొక తేరా వస్తుంది అందులో స్టార్ట్ పై క్లిక్ చేస్తే మీ నెట్ ఎంత స్పీడ్ లో ఉందో చూపిస్తుంది.
Note : 2 వ పాయింట్ లో #speed test పై క్లిక్ చేసిన వెంటనే వచ్చే పద్దతి కూడా ఇదే కనుక ఇక్కడ ఇచ్చే ఇమేజ్ లను చూడగలరు.
7.చూసారు కదా పై ఇమేజ్ లు 138.2 kbps అని వున్నాది గమనించార అక్కడ వున్నా start బటన్ మళ్లి కొంత సేపటి తర్వాత క్లిక్ చేస్తే స్పీడ్ లో మార్పులను చూపిస్తుంది.దానికి మరో ఇమేజ్ ని కింద చుడండి.
8.ఇలా ఎన్ని సార్లు అయిన స్పీడ్ టెస్ట్ చేసుకోవచ్చు అలా అని సమయాన్ని అంత దీనికి కేటా ఇంచటం మంచిది కాదు.ఐతే క్లిక్ లు చేసిన ప్రతిసారి ఒకేలా ఉండక పోవచ్చు అని పైన చుస్తే అర్ధం అవుతుంది.
ఇచ్చట ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసమే.ఈ బ్లాగ్ కి వచ్చి పోస్ట్ చదివిన మీకు కృతజ్ఞతలు.ఇక దినిని మీకు తెలిసిన వారి అందరికి పంపించగలరు.
Tags : #broadband speed test| #bandwidth speed test| #tech news
0 comments:
Post a Comment