Tuesday, November 19, 2019

విండోస్ ఓఎస్ లో వీడియో ఎడిటర్ కోసం చూస్తున్నారా


నమస్తే,విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వీడియో లను ఎడిటింగ్ చేయటం కోసం ఉన్న ఒక మంచి అప్లికేషన్ అదే అనిమొటిక వీడియో ఎడిటర్(Animotica video editor).
ఈ యొక్క యాప్ ని సింపుల్ గా మీ యొక్క లాప్టాప్ లేదా డెస్క్టాప్ లో ఉండే మైక్రోసాఫ్ట్ స్టోర్ లో నుండి ఇంస్టాల్ చేసుకోవచ్చు.
ఇక ఈ యాప్ ఫ్రీ గా అందుబాటులో ఉండటం మరొక మంచి విషయం అనే చెప్పాలి.
ఇక ఈ వీడియో ఎడిటింగ్ యాప్ తో యుట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ వంటి వాటిలో పబ్లిష్ చేయటానికి బాగా పనికొస్తుంది.
ఐతే ఈ యాప్ విండోస్ 10 యూజర్ లకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఇక ఇందులో ప్రదనంగా కొన్ని ఫీచర్స్ అందుబాటులో ఉండటం వలన కొత్త వారికి అలాగే ప్రొఫెషనల్ ఎడిటర్ లకి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ యాప్ సింపుల్ గా ఉపయోగించవచ్చు దాంతో పని సులభం అవుతుంది.

ఇక ఈ వీడియో ఎడిటర్ లో ఉన్న ఫీచర్స్ కింద ఇవ్వటం జరిగింది.
1.వీడియో లను జాయిన్,స్ప్లిట్,ట్రిమ్ మరియు కంబైన్ చేయచ్చు.
2. వీడియో మరియు ఫోటో లను జత చేసి వీడియో గా మార్చవచ్చు.
3. వీడియో లకు వాయిస్ లను, ట్రాన్సిషన్, రొటేట్,కలర్ అడ్జస్ట్ లాంటి ఎఫెక్ట్ లను అప్లై చేయవచ్చు.
4. క్రోమ కీ ని వీడియో లకు అప్లై చేయవచ్చు.
5. అలాగే వీడియో లకు అద్భుతమైన ఎఫెక్ట్స్ లను, క్యాప్షన్ స్ , స్టికర్స్ ను , బ్యాక్ గ్రౌండ్ బ్లర్ చేయటం వంటివి పెట్టుకోవచ్చు.
6. ఇక వీడియో కొన్ని దగ్గర ఫస్ట్ గ కొన్ని దగ్గర స్లో గా పెట్టవచ్చు.


ఈ యొక్క ఎడిటర్ పై ఏదైనా కామెంట్స్ లో తెలపండి.ఇక నచ్చితే షేర్ చేయండి.

0 comments:

Post a Comment