Saturday, November 16, 2019

ఇప్పుడు తెలుగు టైపింగు మరింత సులభం



హాయి ఫ్రెండ్స్, మీరు  విండోస్ లో తెలుగు లో టైపు చేయటం కోసం చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నార. అయితే ఇక ఆలోచిన మనుకోండి ఇప్పటివరకు రకరకాల సాఫ్ట్వేర్ లు వాడి ఏదైనా సమస్య వస్తే ఆ సాఫ్ట్వేర్ ని అనిన్స్టాల్ చేయటం మరలా ఇంస్టాల్ చేసి తెలుగు కోసం సెట్టింగ్స్ పెట్టుకోవటం ఇంకా మొదలయినవి ఇక చేయాల్సిన అవసరం లేదు. మీరు కేవలం విండోస్ 10 కొత్త వెర్షన్ లోకి మారితే చాలు అందులో మైక్రోసాఫ్ట్ బారతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వటం అలాగే లోకల్ మార్కెట్ ని పెంచుకోవటం కోసం ఏదైతేనే ఎమ్ మొత్తం మీద అండ్రాయిడ్ లో గూగుల్ ఎలా అయితే  బారతీయ బాషలు అయిన హిందీ ,తమిళ,కన్నడ,తెలుగు లను తీసుకువచ్చిందో ఇప్పుడు అదే మార్గంలో తెలుగు,హిందీ,తమిళ మొదలయిన బారతీయ భాషలను మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త వెర్షన్ మరియు అప్డేట్ లో అందివ్వటం జరుగుతుంది. ఇక విండోస్ 10 వెర్షన్ ప్రకారంగా ఈ లాంగ్వేజ్ లను ఇవ్వటం జరుగుతుంది.

ఉదాహరణకి : మీరు విండోస్ 10 హోమ్ ఎడిషన్ యూజర్ అయితే కేవలం మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ లో కేవలం ఇంగ్షీషు మరియు మీ ప్రాంతీయ భాష అయినటువంటి తెలుగు,తమిళ ఇలాంటి ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.

మరి ఇందుకోసం అలాగే సింపుల్ గా తెలుగు లో టైపు చేయటం కోసం విండోస్ 10 కి మారండి. ఇక తెలుగు లాంగ్వేజ్ ని ఎలా సెట్ చేయాలో కింద వివరంగా ఇవ్వటం జరిగింది చూసి నేర్చుకోండి.

1. మొదటిగా విండోస్ 10 మారిన తరువాత, విండోస్ అప్డేట్ చేయండి.
2. ఇప్పుడు స్టార్ట్ మేను పై క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి.
3. అక్కడ ఉండే వాటిలో టైమ్ అండ్ లాంగ్వేజ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు వచ్చే స్క్రీన్ లో లాంగ్వేజ్ ని ఎంచుకోండి.
5. ఇప్పుడు లాంగ్వేజ్ కి చెందిన సెట్టింగ్స్ పేజీ వస్తుంది అందులో "preferred languages " లో డీఫాల్ట్ గా ఇంగ్షీషు ఉంటుంది.
6. ఇప్పుడు add a preferred language పై క్లిక్ చేయండి.
7. ఇప్పుడు choose a language to install వస్తుంది అందులో మీకు నచ్చిన బాష అంటే తెలుగు లేదా హిందీ ఎందులో టైపు చేయాలి అనుకుంటే అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన లాంగ్వేజ్ ఇంస్టాల్ అవుతుంది (నెట్ కనెక్షన్ ఉండాలి).
8. మరలా preferred languages లోకి వచ్చి ఇంస్టాల్ చేసిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి అందులో options కనిపిస్తుంది దాని పై క్లిక్ చేయండి.
9. ఇప్పుడు వచ్చే దాంట్లో కీబోర్డు అని ఉంటుంది అందులో add a keyboard క్లిక్ చేయండి అందులో మీరు ఇంస్టాల్ చేసిన లాంగ్వేజ్ యొక్క ఫోనెటిక్ యొక్క ఆప్షన్ ఉంటుంది అది సెలెక్ట్ చేయండి.
10. ఇప్పుడు నోటిఫికేషన్ ఏరియా లో డిఫాల్ట్ గా ఇంగ్షీషు ఉంటుంది కదా దాని పై క్లిక్ చేస్తే తెలుగు అయితే దాని యొక్క ఫోనెటిక్స్ కూడిన telugu phonetic అని ఉంటుంది అది సెలెక్ట్ చేయాలి.
11. ఇక ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ అంటే notepad , ms word లాంటివి ఏదైనా ఓపెన్ చేసి టైపు స్టార్ట్ చేయండి. 
  

0 comments:

Post a Comment