Sunday, November 24, 2019

బ్లాక్ ఫ్రైడే మరియు సైబర్ మండే వచ్చేస్తున్నాయి.


నమస్తే, మన భారతీయ పండుగల సమయంలో ఎలా అయితే ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ బిజినెస్ చేసేవారు తమ కస్టమర్స్ కోసం రకరకాల ఆఫర్స్ ఇస్తారో అదే విదంగా అమెరికా కి చెందిన వ్యాపారులు గూడ్స్ మరియు సర్వీస్స్ పై భారీ ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ లాంటి వాటిని ఈ యొక్క బ్లాక్ ఫ్రైడే మరియు సైబర్ మండే రోజుల్లో ఇస్తూ ఉంటారు. ఈసారి బ్లాక్ ఫ్రైడే నవంబర్ 29న , సైబర్ మండే డిసెంబర్ 2న రావటం జరుగుతుంది.
ఇక ఆఫర్స్ పై వస్తువు లేదా సర్వీస్ కొనాలి అనుకుంటే అమెరికా కి చెందిన వెబ్సైట్ లను ఒకసారి చూడాల్సిందే. అలాగే ఈ ఆఫర్స్ కూడా రకరకాలు గా అందిస్తారు కొందరు వ్యాపారులు వారం ముందే ఇస్తూ ఒక టైం పెడతారు మరి కొంత మంది అదే రోజు కొంత సమయం మాత్రమే ఆఫర్ వర్తించేటట్లు ఇస్తారు ఇలా ఒక ఒకరు ఒకలా ఆఫర్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది.
ఈ రెండు రోజులు ఎలాంటి వాటి పై ఆఫర్స్ ఉంటయో తెలుసా
డొమైన్ నేమ్స్ , వెబ్ సైట్ హోస్టింగ్, గాడ్జెట్స్ , సాఫ్ట్వేర్స్ ఇంకా మొదలైన వాటి పై ఈ యొక్క బ్లాక్ ఫ్రైడే మరియు సైబర్ మండే రోజుల్లో మంచి ఆఫర్స్ ఇవ్వటం జరుగుతుంది.

ఉదాహరణకు : అమెజాన్ ఇండియా వెబ్సైట్ కాకుండా అమెజాన్ అమెరికా కి చెందిన amazon.com లో చూడండి ఆఫర్స్ ఎలా ఉన్నాయో అర్ధం అవుతుంది.

ఇక వెబ్సైట్ లో ఆఫర్స్ కి టెంప్ట్ అయ్యి కొనాలి అనుకుంటే ఆ యొక్క వెబ్సైట్ లో ఇచ్చిన వివరాలు పరిగణలోకి తీసుకోండి అంటే ఆ యొక్క వెబ్సైట్ యుఆర్ఎల్ https ఉందా లేదా వెబ్సైట్ డిజైన్ ఇంకా మొదలైనవి. ఇక ఇదే సమయంలో చాలా ఫేక్ వెబ్సైట్ లు అందులో ఆఫర్స్ ఉన్నాయి అంటూ లింక్స్ మీకు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు కనుక అటువంటి వాటి పై క్లిక్ చేయకుండా జాగర్త వహిచండి.

ఈ టాపిక్ మీకు అవగాహన కోసం మాత్రమే ఇవ్వటం జరిగింది. నచ్చితే షేర్ అండ్ కామెంట్ చేయండి.

0 comments:

Post a Comment