Saturday, November 23, 2019

ఫ్రీలాన్సర్స్ కోసం రేజర్ పే తెచ్చిన ఫీచర్


నమస్తే, ఈ రోజుల్లో చాలా మంది ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ చేసే వారు యొక్క బిజినెస్ లకు అలాగే కొత్త గా వ్యాపారం లోకి వచ్చే వారికి ముఖ్యముగా కావల్సిన పేమెంట్ సొల్యూషన్స్ అందులో ఒకటి ఈ రేజర్ పే.
ఇక ఈ రేజర్ పే బెంగళూర్ ఆధారంగా పని చేసే ఒక స్టార్ట్ అప్ కానీ ఇది అన్ని రకాల పేమెంట్ ఫీచర్స్ అందిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది తమ యొక్క ప్రొడక్ట్స్  మరియు సర్వీస్ ఏమైతే ఉంటాయో వాటిని ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా తమ యొక్క కస్టమర్ లకి అమ్మటం జరుగుతుంది .ఇక అటువంటి వాటికి ఈ యొక్క రేజర్ పే సొల్యూషన్స్ ఉపయోగించి పెమెంట్స్ చేయవచ్చు. ఈ రేజర్ పే 100రకాల కరెన్సీ లను సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ పేమెంట్ ప్లాట్ఫారం ఫ్రీలాన్సర్స్ కి పెమెంట్స్ రిసీవ్ చేసుకోవటానికి బాగా ఉపయోగంగా ఉంటుంది. ఇంకా ఈ రేజర్ పే తో జిఎస్ట్ కి చెందిన బిల్స్ మరియు ఇతర ఆర్ధిక పరమైన విషయాలను ఈజీ గా మైంటైన్ చేయవచ్చు. ముఖ్యంగా రేజర్ పే సోషల్ మీడియా ద్వారా పెమెంట్స్ చేసేవారి పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
అలాగే ఈ కంపెనీ కరెంట్ అకౌంట్స్ కోసం రేజర్ పే ఎక్స్ విడుదల చేసినట్లు ప్రకటించింది.


ఈ టాపిక్ మీకు నచ్చితే షేర్ మరియు కామెంట్ చేయండి.

0 comments:

Post a Comment