Saturday, February 22, 2020

నచ్చిన వెబ్సైట్ ని ఇలా సెట్ చేసుకోండి

నమస్తే, కొన్ని సార్లు ఒకే వెబ్సైట్ పదే పదే ఓపెన్ చేయల్సిన అవసరం ఉంటుంది దానికోసం సెర్చ్ లో  టైప్ చేసి ఎంటర్/గో ఇస్తే కానీ వెబ్సైట్ లోకి వెళ్లలెం కదా మరి అటువంటి వెబ్సైట్ లేదా కొన్ని నచ్చిన వెబ్సైట్ లను విండోస్ 10 లో  డెస్క్టాప్/స్టార్ట్ మెనూ పై వెబ్సైట్ లను త్వరగా ఓపెన్ చేసుకునే విధంగా సెట్ చేసుకోవచ్చు అందుకోసం కింద స్టెప్స్ వారీగా ఇవ్వటం జరిగింది చూడండి.

క్రోమ్ బ్రౌజర్ :

క్రోమ్ బ్రౌజర్ నుండి ఒక వెబ్సైట్ ని విండోస్ డెస్క్టాప్ లో taskbar పై సెట్ చేసి త్వరగా ఓపెన్ చేయటం ఎలానో చూడండి.
1. క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి ఏదైనా వెబ్సైట్ లేదా ఎక్కువగా వెబ్సైట్ ఓపెన్ చేయండి.
2. ఇప్పుడు టాప్ రైట్ కార్నర్ లో మూడు చుక్కలు కనిపిస్తాయి దాని పై క్లిక్ చేయండి.
3.ఇప్పుడు వచ్చే మెనూ లో more tools పై మౌస్ ని ఉంచితే మరొక మెనూ వస్తుంది అందులో create shortcut పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు స్క్రీన్ పై ఒక బాక్స్ వస్తుంది అందులో క్రియేట్ పై క్లిక్ చేస్తే ఆ యొక్క వెబ్సైట్ డెస్క్టాప్ పై ఐకాన్ రూపంలో కనిపిస్తుంది.
5.ఇప్పుడు వెబ్సైట్ ఐకాన్ పై రైట్ క్లిక్ చేస్తే మెనూ వస్తుంది అందులో pin to taskbar /pin to start లో నచ్చినది సెలెక్ట్ చేస్తే మీ వెబ్సైట్ షార్ట్కట్ create అవుతుంది అంతే ఇక నుండి సింపుల్ గా మీకు నచ్చిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అది కూడా taskbar నుండి లేదా స్టార్ట్ మెనూ నుండి.

● ఎడ్జ్ బ్రౌజర్ :

ఇక edge బ్రౌజర్ లో ఓపెన్ చేసే వెబ్సైట్ లను ఎలా షార్ట్కట్ చేసి taskbar/start menu లో యాడ్ చేయాలో చూడండి.
1. ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేసి నచ్చిన / పదే పదే వాడే వెబ్సైటు ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఐకాన్ పై క్లిక్/ 3 డాట్స్ పై క్లిక్ చేస్తే మెనూ వస్తుంది.
2. అందులో కనిపించే more tools పై క్లిక్ చేస్తే మరొక మెనూ వస్తుంది అందులో pin to taskbar సెలెక్ట్ చేస్తే సరిపోతుంది నచ్చిన వెబ్సైట్ taskbar పై షార్ట్కట్ క్రియేట్ అవుతుంది.

● ఫైర్ ఫాక్స్ :

ఫైర్ ఫాక్స్ లో ఒక వెబ్సైట్ ని వేగంగా ఓపెన్ చేయాలి అంటే  చెప్పిన విధంగా చేయండి ఇది పూర్తిగా పై బ్రౌజర్ లకు డిఫరెంట్ గా ఉంటుంది.
మీకు ఏ వెబ్సైట్ త్వరగా  చేయాలి అంటే ఆ వెబ్సైట్ యొక్క లింక్ ని కాపీ చేయండి.
1.ఇప్పుడు ఫైర్ ఫాక్స్ పై రైట్ క్లిక్ చేసి properties పై క్లిక్ చేయండి.
2. అందులో ఉండే shortcut పై క్లిక్ చేస్తే target అని ఉంటుంది అందులో firefox.exe" అని ఉన్న దాని పక్కన కాపీ చేసిన లింక్ ని పేస్ట్ చేసి ok చేయండి అంతే మీకు కావలసిన వెబ్సైట్ యొక్క షార్ట్కట్ అయింది ఇప్పుడు దాన్ని taskbar/start menu లోకి పెట్టుకొని ఓపెన్ చేయండి.

నోట్ : ఇక ఆ వెబ్సైట్ ఏ బ్రౌజర్ నుండి షార్ట్కట్ గా చేసారో అందులో మాత్రమే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.


0 comments:

Post a Comment