Monday, February 3, 2020

గూగుల్ మ్యాప్స్ ఇలా ఐతే వార్నింగ్ వస్తాయి ఎలా ఆక్టివేట్ చేయాలో చదవండి.


నమస్తే, గూగుల్ నుండి వచ్చిన సర్వీస్ లో ఒకటి మ్యాప్స్. ఈ మ్యాప్ చాలా రకాల కోసం ఉపయోగిస్తున్న సంగతి తెల్సిందే. అందులో ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్ కి వెళ్లే సమయంలో రూట్ చేసుకోవటం చేస్తూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా తెలియని ఏదైనా ప్లేస్ కి వెళ్లే సమయంలో కూడా గూగుల్ మ్యాప్స్ లో డైరెక్షన్స్ ని యూజ్ చేస్తాం. ఐతే గూగుల్ ఇటీవలే కొత్త వెర్షన్ అప్డేట్ లో కొత్త ఫీచర్ అనేది గూగుల్ మ్యాప్స్ లో జత చేయటం జరిగింది.
ఈ ఫీచర్ తో తెలిసిన లేదా తెలియని ప్రాంతంలో ప్రయాణం చేసే సమయంలో టాక్సీ లేదా ఇతర వెహికల్ వెళ్లాల్సి ఉంటుంది ఆ సమయంలో గూగుల్ మ్యాప్స్ లో లాగిన్ అయ్యి డైరెక్షన్ పై క్లిక్ చేస్తే from address మరియు to address ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన వెంటనే ఆ అడ్రస్ లకు రూట్లు ఎన్ని ఉంటే అన్ని చూపిస్తుంది ఇక ఇక్కడ మీరు ఏ రూట్ లో డ్రైవర్ మీరు ఎక్కిన వెహికల్ తీసుకువెళ్తున్నారో ఆ రూట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక కింద ఒక కార్డ్ లాగా వస్తుంది అందులో స్టే సెఫర్ (stay safer) అని ఆప్షన్ పై క్లిక్ చేస్తే మరొక రెండు ఆప్షన్స్ వస్తాయి అందులో ఒకటి share live trip మరియు get off route alerts అని ఉంటాయి అందులో మొదటి ఆప్షన్ ఎంచుకుంటే మీ ఫ్రెండ్స్ లేదా ఇతర కాంటాక్ట్ వారికి మీ ట్రిప్ లైవ్ అనేది వారికి వెళ్తుంది మీరు ఇక్కడ ఉన్న వారికి తెలుస్తుంది. అలా కాకుండా రెండో ఆప్షన్ ఎంచుకుంటే డ్రైవర్ మీరు ఎంపిక చేసిన రూట్ లో కాకుండా వేరే మార్గంలో వెళ్తున్న వెంటనే అలర్ట్స్ ఇవ్వటం జరుగుతుంది.

ఇక ఈ టాపిక్ మీకు నచ్చితే షేర్ చేయండి. కామెంట్ లో మీ అభిప్రాయాలను తెలియజేయండి

0 comments:

Post a Comment