ఈ రోజు పోస్టులో మీకు ఒక అప్ లో వచ్చిన కొత్త ఆప్షన్ గురుంచి తెలియచేస్తున్నాను.అదేనండి మీ స్మార్ట్ ఫోన్ లో యుట్యూబ్ అప్ ఉందా లేక పోతే కింద బటన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
ఈ అప్ ని డౌన్లోడ్ చేసుకోమంటునాడు ఏంటి అనుకుంటునారా అందులోనే కొత్త ఆప్షన్ చేర్చారు .youtube app లో కొత్తగా offline అవకవాసాన్ని కలిపించారు దీనితో ఇంటర్నెట్ స్లో గా ఉన్న సమయంలో కూడా యుట్యూబ్ నుండి వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇందులో విశేషం ఏమిటంటే యుట్యూబ్ లో ప్లే అవ్వనివి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ అప్ లో ఉన్న offline ఆప్షన్ ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ లలో కూడా పనిచేస్తుంది.ఐతే ఇది అని ఫార్మటులు అంటే 3gp,mp4,mp3,avi లు కాకుండా డౌన్లోడ్ అయిన తర్వాత .exo ఫైల్స్ గా పరిగినించాబడతాయి.అలాగే ఈ అప్ లో మ్యూజిక్ మరియు మూవీ వీడియోలు మాత్రం డౌన్లోడ్ అవ్వవు.
ఇక ఆసలు విషయంనికి వద్దాం.
1.మొదట ఈ అప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇంస్టాల్ చేయండి.
2.తర్వాత అక్కడ సెర్చ్ లో మీకు కావలసిన వీడియో పేరు ని టైపు చేసి అప్పుడు కింద వచ్చే లిస్టు లో వీడియో ని ఎంచోకోండి ఇక్కడ వీడియో ప్లే అవుతున్న కింద డౌన్లోడ్ ఐకాన్ కనిపిస్తుంది అది ఎలాగో కింది ఇమేజ్ లో ఉన్న step 1 లో బాణం గుర్తుతో చూపించటం జరిగింది గమనించారా.
3.ఇప్పుడు ఆ ఐకాన్ పై క్లిక్ చేస్తే మీకు ఒక 'Add video to offline'అని స్క్రీన్ పై వస్తుంది అందులో మీకు నచ్చిన సైజులు అంటే వీడియో మీకు కావాల్సిన క్వాలిటీ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.అది ఇమేజ్ లోని step 2 చుస్తే అర్ధం అవుతుంది.
4.అలా సెలెక్ట్ చేసిన వెంటనే మీరు ఎంచిన వీడియో డౌన్లోడ్ అవుతుంది .ఆది ఎలా అవుతుందో ఇమేజ్ లోని step 3 ని చుడండి.
ఇలా డౌన్లోడ్ చేసిన వీడియోలు play చేయాలి అంటే youtube app లోనే అవుతాయి.ఇలా ప్లే అవ్వటానికి కారణం ముందుగా చెప్పినట్లు .exo ఫార్మాట్ కనుక ఈ అప్ లోనే ప్లే అవుతాయి.అలాగే వీటిని మిగతా ఏ మీడియా ప్లేయర్ లో ప్లే చేద్దామన్న అవ్వవు.
0 comments:
Post a Comment