Wednesday, August 12, 2015

"1925" ఏంటి ఈ సంఖ్య ఐతే చదవండి మరి

"1925" ఇక్కడ నేను చెప్పబోయేది ఒక యాడాదిలో జరిగే విశేషాలు కాదు మరి ఏంటి అనుకుంటున్నారా .అది ఏంటి అంటే TRAI వారు ఈ నెంబర్ ని ప్రవేశ పెట్టారు .ఇంతకి  TRAI అంటే ముందుగా మీకు చెప్పాలి ట్రాయ్ మన నెట్వర్క్ ప్రొవైడర్లని నియత్రించే వ్యవస్థ. ఆలాగే వినుయోగాదారులకి నెట్వర్క్ ప్రొవైడర్ లకి మధ్య వారది వంటిది .


  
 ఇంకా వినుయోగాదారుల సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.గత కొంత కాలంగా ట్రాయ్ ఒక సమస్య పై పని చేసి దానికి పరిష్కారం కనుకున్నది దానికి ప్రతిఫలమే "1925" నెంబర్.
                                      ట్రాయ్ ఇంతకి ఏ సమస్య పై పని చేసిందో తెలుసా అదే నండి మన స్మార్ట్ ఫోన్స్ లో ఇంటర్నెట్ అనేది ఆక్టివేట్ లేదా డిఆక్టివేట్ తేలికగా చెప్పాలి అంటే on/off అన్నమాట.
                          ట్రాయ్ దిని పై పని చెయ్యటానికి కారణం స్మార్ట్ ఫోన్లు వాడకం వచ్చిన తరవాత మొబైల్ సంస్థలు అయినటువంటి ఎయిర్టెల్,వోదఫోన్,మొదలైనవి వినుయోగాదారుని అనుమతి లేకుండానే ఇంటర్నెట్ అనేది వారి స్మార్ట్ ఫోన్స లో ఆక్టివేట్ చేస్తున్నారు.ఇది గమనించిన చాల మంది ట్రాయ్ కి కంప్లీట్ చెయ్యటంతో దానికి పరిష్కారంగా "1925" నెంబర్ పరిచయం చేస్తోంది.
                                       ఇక ఈ నెంబర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.మీ స్మార్ట్ ఫోన్ లేదా తెలిసిన వారి స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ ఆక్టివేట్ లేదా డిఆక్టివేట్ చెయ్యవచ్చు దానికి మీరు 1925 నెంబర్ కి డయల్ చేస్తే ఆచ్చం కస్టమర్ కేర్ తరహా లో స్పందిస్తుంది.
                                       మరొక విధానం కూడా ఉంది అదే మెసేజ్ పంపుట దీనికి మీరు START అని టైపు చేసి 1925 కి send చెయ్యాలి అప్పుడు మీ ఫోన్ లో ఇంటర్నెట్ అనేది ఆక్టివేట్ లేదా on అవుతుంది.వద్దు అనుకుంటే STOP అని టైపు చేసి 1925 కి send చేస్తే సరిపోతుంది ఇప్పుడు మీ ఫోన్ లో ఇంటర్నెట్ ఆగిపోతుంది దానినే డిఆక్టివేట్ లేదా off అందురు.




For Redmi 2 Prime details click on below

0 comments:

Post a Comment