నమస్తే, xiaomi రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ను విడుదల చేయటం జరిగింది. ఇక ఈ మోడల్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ను ఫోన్ లాక్ మరియు unlock చేయటం కోసం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈ మోడల్ స్మార్ట్ ఫో న్ 3 రోంగుల్లో 🥳 మరియు 3 వేరియంట్ లో తీసుకురావటం జరిగింది. అందులో ముందుగా నోట్ 9 ప్రో మ్యాక్స్ లో చూసుకుంటే 3 రంగులు అంటే వైట్, బ్లాక్, అరోరా బ్లూ కలర్ ఇవ్వటం జరిగింది. ఇక వేరియంట్ మరియు ధరలు చూసుకుంటే కింద విధం గా ఉన్నాయి.
6GB/64GB > 14,999₹
6GB/128GB > 16,999₹
8GB/128GB > 18,999₹ గా ధరలను పెట్టటం జరిగింది.
ఇక కెమెరా విషయాలకు వస్తే వీటినే ఎక్కువగా xiaomi ఫోకస్ చేసినట్లు రిలీజ్ ఈవెంట్ చాలా స్పష్టంగా తెలుస్తోంది. ధర లో మార్పులు కేవలం మెమరీ బట్టి కేటాయించటం జరిగింది కెమెరా ఫీచర్స్ అంతా ఒకటే అని చెప్పాలి. ఇక బ్యాక్ 4 కెమెరాలు ఫ్రంట్ ఒక కెమెరా ఇవ్వటం జరిగింది.అలాగే ఇందులో 4k వీడియో రికార్డ్ అది కూడా 30FPS తో చేసుకునే సదుపాయం ఉంది.
ఈ మోడల్ కి చెందిన పూర్తి కెమెరా కి చెందిన వివరాలు కింద ఇవ్వటం జరిగింది.
బ్యాక్ సైడ్ కెమెరాలు
📷 64 MP వైడ్ ప్రైమరీ కెమెరా
📷 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా
📷 5MP మాక్రో కెమెరా
📷 2MP డెప్త్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా వివరాలు
32MP సెల్ఫీ కెమెరా అది కూడా డిస్ ప్లే లోపల ఇవ్వటం జరిగింది.
ఇక ఈ కెమెరా 4k వీడియో తీయటం కుదరదు.
ఈ నోట్ 9 ప్రో మ్యాక్స్ మోడల్ కి ప్రొటెక్షన్ గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అనేది మూడు లేయర్స గా ఇవ్వటం జరుగుతోంది.
ఇక రెండు ర్యాం మోడల్స్ కూడా ఓకే రకమైన ప్రాసెసర్ కెపాసిటీ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 720G నీ ఏర్పాటు చేయటం జరిగింది. Xiaomi ఇందులో ఛార్జింగ్ త్వరగా అవ్వటం కోసం 33W ఛార్జర్ నీ అందిస్తోంది దీంతో ఛార్జింగ్ 50% కేవలం అరగంటలో అవుతుంది అని తెలిపింది. అలాగే ఈ మోడల్ లో sim స్లాట్ మరియు మెమరీ కార్డ్ స్లాట్ ఇవ్వటం ద్వారా రెండు సిం కార్డ్స్ మరియు మెమరీ 512 GB వరకు పెంచుకోవచ్చు.
ఈ నోట్ 9 ప్రో మ్యాక్స్ లో బ్యాటరీ గా 5020 Li polymer నీ జత చేయటం జరిగింది. ఇక ఈ ఫోన్ display సైజ్ వచ్చేసరికి 6.67 ఇంచేస్ గా ఉంటుంది.
ఇక రెడ్ మీ నోట్ 9 ప్రో మాక్స్ మొబైల్ అమెజాన్, ఎమ్ ఐ స్టోర్ మరియు ఎమ్ ఐ హోమ్స్ కొనుగోలు చేయవచ్చు. ఇక భారత్ మార్కెట్ లో మార్చ్ 25, 2020 నుండి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.
ఇక రెడ్ మీ నోట్ 9 ప్రో మాక్స్ మొబైల్ అమెజాన్, ఎమ్ ఐ స్టోర్ మరియు ఎమ్ ఐ హోమ్స్ కొనుగోలు చేయవచ్చు. ఇక భారత్ మార్కెట్ లో మార్చ్ 25, 2020 నుండి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.