Thursday, March 5, 2020

వాట్సప్ డార్క్ థీమ్ ఎలా పెట్టుకోవాలో చూడండి

నమస్తే, వాట్సప్ యూజ్ చేస్తున్నట్లు ఐతే మీకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే వాట్సప్ డెవలపర్స్ లేటెస్ట్ అప్డేట్ లో భాగంగా డార్క్ థీమ్ ఫీచర్ ని యాప్ లో యాడ్ చేశారు. ఈ ఫీచర్ తీసుకురావటానికి ప్రధాన కారణం కంటి పై వత్తిడి తగ్గించటం కోసం అని వాట్సప్ తెలిపింది. ఇక ఈ డార్క్ మోడ్ లో పెట్టటం ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఎక్కువుగా అవ్వదు. ఇక ఈ డార్క్ మోడ్ లో ఎలా పెట్టాలో కింద వివరంగా ఇవ్వటం జరిగింది.
1. ముందుగా వాట్సప్ యాప్ ప్లే స్టోర్ లో వచ్చిన అప్డేట్ నుండి అప్డేట్ చేసుకోండి.ఒక వేళ అప్డేట్ రాకపోతే వెయిట్ చేయండి న్యూ ఫీచర్ కోసం వేరే వాటి నుండి అప్డేట్ చేసుకోకపోవడం మంచిది.
2. ఇక అప్డేట్ చేసుకున్న వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.పైన 3 డాట్స్ పై క్లిక్ చేయండి
3.ఇప్పుడు whatsapp>settings లోకి వెళ్లండి.
4.ఇప్పుడు కొన్ని సెట్టింగ్స్ కి మెనూ లిస్ట్ కనిపిస్తుంది అందులో chats పై క్లిక్ చేయండి.
5. Chats పై క్లిక్ చేసిన మరొక స్క్రీన్ వస్తుంది అందులో theme అని ఉంటుంది దాని పై క్లిక్ ఇస్తే choose theme అని బాక్స్ వస్తుంది అందులో light/dark అని ఉంటాయి అందులో dark ఎంచుకునీ ok పై క్లిక్ చేయండి.

అంతే మీ వాట్సప్ ఇప్పుడు డార్క్ థీమ్ లోకి మారిపోతుంది.

0 comments:

Post a Comment