Monday, January 6, 2020

PicsArt లో ఫాంట్స్ ని ఎలా పెట్టాలో చూడండి.


నమస్తే , లాస్ట్ పోస్ట్ లో wps ఆఫీస్ లో ఫాంట్స్ పెట్టటం చూసి ఉంటారు. ఇప్పుడు picsart లో fonts ఎలా పెట్టాలి అని చూద్దాం ఒక వేళ wps ఆఫీస్ కి చెందిన కంటెంట్ చదవకపోతే ముందు అది చదవండి. ఇక picsart లో fonts ఎలా పెట్టాలో కింద వివరంగా స్టెప్స్ వారిగా ఇవ్వటం జరిగింది చూసి ఫాంట్స్ ని పెట్టుకోండి.ముందుగా ఫాంట్స్ ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి అందుకోసం online లో కొన్ని వెబ్సైట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే
1. ముందుగా picsart app కావాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇంస్టాల్ చేసుకోండి.
2. ఇప్పటికే ఈ యాప్ వాడుతున్నట్లు ఐతే అప్డేట్ అనేది చేసుకోండి.
3. ఇప్పుడు file manager లో కి వెళ్లి folder వ్యూ లో చూడండి అందులో picsart యాప్ కి చెందిన ఫోల్డర్ ఉంటుంది దాని పై క్లిక్ చేయండి.
4. ఈ ఫోల్డర్ లో మరొక 3 ఫోల్డర్లు ఉంటాయి అందులో ఫాంట్స్ పై క్లిక్ చేయండి.
5. డౌన్లోడ్ చేసి ఉంచిన ఫాంట్స్ ని ఈ ఫాంట్స్ ఫోల్డర్ లో కాపీ మరియు పేస్ట్ చేయండి అంతే

picsart లో ఫాంట్స్ పెట్టటం జరిగింది ఇక యాప్ ఓపెన్ చేసి ఫాంట్స్ ని అప్లై చేయండి.

0 comments:

Post a Comment