Sunday, December 15, 2019

wps office లో ఫాంట్స్ ని ఎలా పెట్టాలో చూడండి



నమస్తే, wps office suite ని మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ లేదా ఇతర ప్లాట్ ఫారం లపై ఇన్స్టాల్ చేసి వాడుకోవచ్చు. ఇది ms ఆఫీస్ తరహాలోనే డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇందులో ఫైల్స్ convert చేసుకునే సదుపాయాలు ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే మిగతా కావాలి అనుకుంటే ప్రీమియం వెర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్రీ వెర్షన్ లో డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్స్, ప్రజెంటేషన్ లు చేయవ్వచ్చు. అలాగే ఈ యొక్క wps office లో ప్రి డిజైన్ టెంప్లేట్స్ కూడా అందుబాటులో ఉండటం విశేషం. ఉదాహరణకు మీకు resume తయారు చేయాలి అనుకుంటే ఈ టెంప్లేట్ లో నుండి తీసుకిని అక్కడి ఉన్న వాటిని తీసేసి మీకు కావలసిన డీటెయిల్స్ ని యాడ్ చేస్తే మీ resume అయిపోయినట్లే.

ఇక టాపిక్ మెయిన్ కంటెంట్ లోకి వెళ్లిపోతే ఈ యొక్క wps ఆఫీస్ లో ఫాంట్స్ అనేవి కావాలి అంటే కొనుగోలు చేయాల్సి ఉంటుంది కానీ అటువంటి అవసరం ఏమి లేకుండా wps ఆఫీస్ డెవలపర్స్ ఒక అవకాశం అనేది ఇవ్వటం జరిగింది దాంతో మీకు నచ్చిన fonts ని ఈ యొక్క wps office లో పెట్టి డాక్యుమెంట్ చేసే సమయంలో అప్లయ్ చేయవచ్చు. కింద స్టెప్స్ వారీగా ఇవ్వటం జరిగింది చూడండి. కింద నేను wps office app  లో ఫాంట్స్ ని పెట్టడం గురుంచి వివరించటం జరుగుతోంది గమనించండి.
1. wps office ని ఆండ్రాయిడ్ మొబైల్ ఐతే ప్లే స్టోర్ నుండి మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి.
2.ఇంస్టాల్ అయిన తరువాత కావలసిన fonts ని 1001fonts.com , dafonts.com వంటి వెబ్సైట్ లనుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ కాబడిన ఫైల్స్ జిప్ లో ఉంటాయి కనుక వాటిని extract అంటే విడదీయండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్ కి చెందిన ఫోల్డర్ మీరు ఎక్కడ extract చేస్తే అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేయండి అందులో మీరు ఎంపిక చేసి డౌన్లోడ్ చేసిన fonts ఉంటాయి ఈ ఫాంట్స్ format వచ్చేసరికి .ttf లేదా .otf కలిగి ఉంటాయి కనుక వాటిని మాత్రమే సెలెక్ట్ చేసి copy చేయండి.
3. ఈ copy చేసిన fonts ని wps office లో పెట్టటం కోసం file manager ని ఓపెన్ చేయండి.
4. అందులో folder ఉండే విభాగం లో కి వెళ్ళండి
5. లేదా సెర్చ్ లో android అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇప్పుడు వచ్చే లిస్ట్ లో android folder కనిపిస్తుంది అది క్లిక్ చేయండి.
6. ఇప్పుడు file manager లో కనిపించే మెనూ లో "show hidden files" క్లిక్ చేయండి.
7. ఆండ్రాయిడ్ ఫోల్డర్ పై క్లిక్ చేస్తే మిగతా ఫోల్డర్లు ఓపెన్ అవుతాయి అందులో data folder ని ఓపెన్ చేయండి.
8. ఇప్పుడు అందులో ఉండే cn.wps.moffice_eng అనే ఫోల్డర్ ని ఓపెన్ చేయండి.
9. ఇక్కడ .cache అనే hidden ఫోల్డర్ కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేయండి.ఇప్పుడు kingsoft office ఫోల్డర్ కనిపిస్తుంది అది ఓపెన్ చేయండి.
10.ఈ ఓపెన్ చేసిన ఫోల్డర్ లో .fonts అనే ఫోల్డర్ ఉంటుంది అది ఓపెన్ చేసి మీరు copy చేసిన ఫాంట్స్ ని paste చేయండి.

అంతే మీకు నచ్చిన లేదా కావాల్సిన fonts ని విజయవంతంగా wps office లో పెట్టేసారు . ఇప్పుడు wps ఆఫీస్ యాప్ ని ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేయండి అందులో ఫాంట్స్ లోకి వెళ్లి మీరు copy and paste చేసిన font ని సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ లో టైపింగ్ స్టార్ట్ చేయండి అంతే.


ఈ టాపిక్ నచ్చితే ఒక్క షేర్ మరియు కామెంట్ చేయండి.

0 comments:

Post a Comment